నస్పూర్, వెలుగు: ఏరియాలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును నాణ్యతతో వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉందని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆఫీసర్లతో సోమవారం రివ్యూ నిర్వహించారు. నాణ్యమైన బొగ్గుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని, బొగ్గు గ్రేడ్ తగ్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అన్ని గనుల విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఏరియాకు నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏరియాలోని అన్ని గనుల ఆఫీసర్లు, గనుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ శిబిరం ప్రారంభం
రక్షణే ప్రథమం–నిత్యం రక్షణ’ నినాదంతో ముందుకు సాగాలని జీఎం సూచించారు. ఏరియాలోని వివిధ గనుల్లో పనిచేస్తున్న జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంశంపై రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్‌పై పూర్తి అవగాహన ఉండాలని, విధి నిర్వహణలో ప్రతి దశలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
రక్షణతో కూడిన ఉత్పాదకత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రీజయన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఎస్వోటు జీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
