సింగరేణి పట్టించుకోలేదని నిర్వాసితుల ఆందోళణ

సింగరేణి పట్టించుకోలేదని నిర్వాసితుల ఆందోళణ
  • మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్ లో డిమాండ్
  • ప్లకార్డులతో నిరసన.. నినాదాలతో హోరెత్తిన సభ

గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్‌‌‌‌‌‌ పరిధిలోని ఆర్జీ 1 ఏరియా మేడపల్లి ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం గతంలో తమ నుంచి తీసుకున్న 900 ఎకరాల భూములను తిరిగి తమకే ఇవ్వాలని లింగాపూర్, మేడిపల్లి, పాములపేట, రామగుండం నిర్వాసిత ప్రజలు డిమాండ్‌‌‌‌ చేశారు. తమ దగ్గర భూములు తీసుకున్న ఇక్కడ అభివృద్ధి చేయలేదని అన్నారు. మేడపల్లి ఓసీపీలో ఏటా 4.09 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 2021‒22 లో ఐదు మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, ఈ పనులకు సంబంధించి శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్‌‌‌‌ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ కుమార్‌‌‌‌ దీపక్‌‌‌‌ అధ్యక్షత వహించగా, పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు ఈఈ భిక్షపతి మినిట్స్‌‌‌‌ రికార్డు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రోగ్రామ్‌‌‌‌ ప్రారంభమైంది. సాయంత్రం 3 గంటల వరకు ప్రజలు నిరసన తెలిపారు. స్థానిక లీడర్లు, ప్రజలు మాట్లాడుతూ మేడిపల్లి ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం లింగాపూర్‌‌‌‌, మేడిపల్లి, పాములపేట, రామగుండం ప్రాంతాలకు చెందిన భూములు తీసుకున్నారని, కానీ ఈ ప్రాంతాలలో సింగరేణి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆవేదన చెందారు. 

లింగాపూర్‌‌‌‌ ఎస్సీ కాలనీ 150 ఇండ్లలో వర్షాకాలంలో ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ మట్టి చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. లింగాపూర్‌‌‌‌ పంచాయతీ రికార్డుల నుంచి ఈ ఇండ్లను తొలగించడంతో అభివృద్ధి నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఆందోళనల నేపథ్యంలో 2017 జనవరిలో లింగాపూర్‌‌‌‌తో పాటు మేడిపల్లి ఎస్సీ కాలనీలో ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అప్పటి జీఎం, ఇతర కార్పొరేట్ ఆఫీసర్లు హమీ ఇచ్చినా దానిని నేటికి నెరవేర్చలేదని గుర్తు చేశారు. బ్లాస్టింగ్‌‌‌‌లతో ఇండ్లు కూలిపోయాయని, ఇప్పటి వరకు చాల మందికి నష్టపరిహారం రాలేదని, ప్రాజెక్ట్‌‌‌‌లో బొగ్గును ఉత్పత్తి చేసి అమ్మకొని నిర్వాసితులకు అన్యాయం చేశారని, ఈ విషయంలో తమకు సింగరేణి జీఎం, అడిషనల్ కలెక్టర్‌‌‌‌ సమాధానం చెప్పేవరకు ఇక్కడే కూర్చుంటామని నిర్వాసితులు మొండికేశారు. భూములు ఇచ్చిన వారికి తిరిగి భూములు ఇవ్వాలని, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలని, నిరుద్యోగులకు సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

సింగరేణికి భూములు ఇచ్చి నేడు భిక్షమెత్తుకోవాల్సిన దుస్థితి నిర్వాసితులకు ఏర్పడిందని మండిపడ్డారు. సింగరేణి జీఎం కె.నారాయణ మాట్లాడుతున్న సమయంలో మరింత పెద్దగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.అభ్యంతరాలను  నమోదు చేసుకుని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపుతామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ కుమార్‌‌‌‌ దీపక్‌‌‌‌ తెలిపారు. నిర్వాసితులకు  ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం కలెక్టరేట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్‌‌‌‌ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, జనరల్‌‌‌‌ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, ఇతర లీడర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాగా ప్రోగ్రామ్‌‌‌‌ మొత్తం పోలీస్‌‌‌‌ పహారా నడుమ సాగగా, సభ ముగిసిన తర్వాత అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌, సింగరేణి ఆఫీసర్ల వాహనాలను అడ్డుకోవడానికి నిర్వాసితులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, బీజేపీ లీడర్‌‌‌‌ కౌశిక హరి, బద్రి రాజు, కన్నూరి సతీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, నిమ్మరాజుల రవి, సాగర్‌‌‌‌, పెండ్యాల మహేశ్‌‌‌‌, మహాంకాళి స్వామి, యాదగిరి సత్తయ్య, కుమ్మరి శ్రీనివాస్‌‌‌‌, బి.జనక్ ప్రసాద్‌‌‌‌, ఇరికిల్ల శంకరయ్య, రమేశ్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌, ఉరిమెట్ల రాజలింగయ్య పాల్గొన్నారు.