కోల్బెల్ట్, వెలుగు: తమకు రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్చేస్తూ సింగరేణి కోల్మైన్స్ పెన్షనర్లు సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీలోని యూనియన్ బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు.
బ్యాంకులో ఖాతాలున్న 70ఏళ్ల లోపు కోల్మైన్స్ పెన్షనర్లకు రూ.30లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10లక్షల ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ మేనేజర్ నిశంత్ కు వినతిపత్రం అందజేశారు.
