
- నవంబర్ చివరలో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తాం
- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైన్ రెండో ఫేజ్ విస్తరణకు చర్యలు తీసుకుంటామని జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం తన కారాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. నిర్ధేశించి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 2,04,500 టన్నులకు గానూ 56శాతంతో 1,15,137 టన్నులు సాధించామని, కేకే–5 గనిలో 17 వేల టనులకు గానూ 17,181 టన్నులతో 101 శాతం ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. ఆఫీసర్లు, ఉద్యోగులు, కార్మికులను అభినందించారు.
కాసీపేట గనిలో 62 శాతం, కాసీపేట–2 గనిలో 71 శాతం,శాంతిఖని గనిలో 54 శాతం, కేకే ఓసీపీలో 48 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో 573 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, కేకే ఓపెన్‌కాస్ట్ మైన్‌లో ఓబీ వెలికితీత లేకపోవడంతో బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు. ఓబీ వెలికితత కోసం కొత్తగా ఎక్స్‌ప్రెస్ ఆన్ద ఆర్వీఆర్ కాంట్రాక్ట్ కంపెనీకి టెండర్ అవార్డు అయ్యిందని చెప్పారు. నాలుగేండ్లలో 1,038 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికి తీయాల్సి ఉంటుందని తెలిపారు.
అటవీ అనుమతుల కోసం ప్రయత్నాలు
రామకృష్ణాపూర్ఓపెన్కాస్ట్ మైన్ రెండో ఫేజ్విస్తరణకు అవసరమైన అటవీ అనుమతుల కోసం సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని జీఎం తెలిపారు. మొత్తం 366 హెక్టార్ల అటవీ భూమి అవసరమన్నారు. ఇటీవల కలెక్టర్, డీఎఫ్‌వోను కలిశామని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామని, త్వరలో ఎంవోఎఫ్ను ఢిల్లీకి పంపిస్తామని పేర్కొన్నారు. నవంబర్ చివరలో పబ్లిక్ హియరింగ్నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రెండో ఫేజ్‌లో ఏటా 20లక్షల టన్నుల టార్గెట్ తో 40 మిలియన్‌టన్నుల బొగ్గును18 ఏండ్లపాటు తవ్వే చాన్స్ ఉందన్నారు.
కేకే ఓసీపీ మాత్రమే రూ.1,447 కోట్ల లాభాల్లో ఉందని, ఏరియాలోని మిగతా అండర్‌గ్రౌండ్ మైన్స్నష్టాల్లో ఉన్నాయని, టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.5,370 ఖర్చు చేస్తే అమ్మకం ద్వారా రూ.4,722 మాత్రమే వస్తోందని చెప్పారు. గతేడాది రూ.95 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఉత్పత్తి వ్యయం, కార్మికుల గైర్హాజరు శాతం తగ్గించాలని పేర్కొన్నారు. కార్మిక వాడల్లో సమస్యలు తెలుసుకునేందుకు జీఎం పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. దసరాను పురస్కరించుకొని బుధవారం సింగరేణి హైస్కూల్లో రాంలీలా నిర్వహిస్తామని చెప్పారు. ఏస్వోటూ జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాసుందర్, ఏజీఎం ప్రసాద్, ఎస్ఈఐఈడీ కిరణ్‌కుమార్, డీవైపీఎం శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.