బొగ్గు గనులపై కొమురయ్య వర్ధంతి

బొగ్గు గనులపై కొమురయ్య వర్ధంతి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్లను సాధించిపెట్టిన ఘనత కార్మిక నేత మనుబోతుల కొమురయ్యకు దక్కుతుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సెంట్రల్​ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ అన్నారు. మందమర్రి, శ్రీరాంపూర్​ఏరియా బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై దివంగత కార్మిక నేత కొమురయ్య 29వ వర్ధంతి వేడుకలను శుక్రవారం కార్మికుల సమక్షంలో జరిపారు. కొమురయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా లీడర్లు మాట్లాడుతూ..1942 మే 1న సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్​వర్కర్స్​ యూనియన్​(ఏఐటీయూసీ) స్థాపించిన వారిలో కొమురయ్య ఒకరన్నారు.

 సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు పెన్షన్​విధానం తీసుకురావడం, సంస్థ బీఐఎఫ్ఆర్​వల్ల నష్టాల బాటలో వెళ్లినప్పుడు కాపాడడంతో ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన జీవితకాలం కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమించారని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, వైస్​ ప్రెసిడెంట్లు భీమనాథుని సుదర్శనం, ఇప్పకాయల లింగయ్య, వెంకటస్వామి, జాయింట్​సెక్రటరీ కంది శ్రీనివాస్, పిట్​సెక్రటరీలు హరిరామకృష్ణ, మార్రి కుమారస్వామి, ప్రేమ్ లాల్, పి.రాజేశం, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.