Singer Chinmayi Tweet: మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానమా!..వారందరూ నాశనమైపోవాలి

Singer Chinmayi Tweet: మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానమా!..వారందరూ నాశనమైపోవాలి

తెలుగు, తమిళ భాషల్లో తన గొంతుతో..తన పాటలతో దగ్గరైన సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada). ఆమె మరోసారి తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ..అసహనం వ్యక్తం చేశారు.

రీసెంట్గా వైరముత్తు(Vairamuthu) రచించిన ‘Maha Kavithai' పుస్తకావిష్కరణ ఈవెంట్ ఇటీవల గ్రాండ్గా జరిగింది. ఈ పుస్తకాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, లోక నాయకుడు కమల్ హాసన్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.

మహిళలను వేధించిన వారికి మద్దతుగా నిలిచేందుకు వచ్చిన అతి పెద్ద శక్తులు..అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ పుస్తకావిష్కరణ ఈవెంట్ గురించి ప్రముఖ టీవీ ఛానెల్ ట్వీట్ చేసింది. దీన్ని చిన్మయి రీట్వీట్ చేస్తూ..ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

‘నన్ను వేధింపులకు గురిచేసిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు వేదికపై ఉన్నారు. అతడి గురించి బయటకు చెప్పిన నేను మాత్రం నిషేధం పేరిట నా కెరీర్‌లో విలువైన కాలాన్ని కోల్పోయాను.అలాగే కొన్నేళ్లపాటు నాకు ఇష్టమైన వృత్తిని కూడా కోల్పోయాను. మహిళల వేధింపులకు పాల్పడేవారికి సపోర్ట్ చేసే వ్యక్తులు నాశనమైపోవాలి. ఇక నా కోరిక నెరవేరేవరకు ప్రార్థించడం మినహా నేను చేసేది ఏమీలేదు’ అని చిన్మయి తన లేటెస్ట్ పోస్ట్ ద్వారా తెలిపింది. 

2018లో చిన్మయి లిరిక్ రైటర్ వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనిపై వచ్చిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదంటూ.. చిన్మయిని ఐదేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి నిషేధం విధించారు. దీనిపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే  ఉంది. లేటెస్ట్గా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.