సమాజంలో జరిగే సంఘటనలు మరియు మహిళలపై జెరిగే ఆకృత్యాలపై స్పందిస్తూ ఉంటుంది ప్రముఖ సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే మరియు మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ని విమర్శించే క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటి సమంత వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం ప్రస్తుతం రాజీకీయాల్లో అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోహాట్ టాపిక్ గా మారింది.
ALSO READ | మంత్రి సురేఖ గారూ.. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి : నాగార్జున
సింగర్ చిన్మయి ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా దురదృష్టవశాత్తూ చాలామంది వ్యక్తులు, తెలుగు యూట్యూబ్ ఛానెళ్లు, మీడియా వ్యక్తులు తమ సొంత మైలేజ్, ఎజెండా కోసం మరియు వీడియోల ద్వారా డబ్బులు సంపాదించడం కోసం సమంత పేరును ఉపయోగించడం బాధాకరమని పేర్కొన్నారు.అలాగే సమంతపై వ్యాఖ్యలు చేసినవారు ఈ నవరాత్రుల సమయంలోవారి కర్మలని అనుభవిస్తారని, ఇది చాలా మంచి సమయమని ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ లో చిన్మయి శ్రీపాద మంత్రి కొండా సురేఖ పేరుని ప్రస్తావించనప్పటికీ ఈ ట్వీట్ మంత్రి కొండా సురేఖ ని ఉద్దేశించి చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.
— Chinmayi Sripaada (@Chinmayi) October 2, 2024
End of the day all it proves is that…