జయం రవి విడాకులకు నేనెలా కారణం? నా జీవితంలో నరకం చూశా : సింగర్ కేనిషా ఎమోషనల్

జయం రవి విడాకులకు నేనెలా కారణం?  నా జీవితంలో నరకం చూశా : సింగర్ కేనిషా ఎమోషనల్

గత కొన్ని నెలలుగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం.. నటుడు జయం రవి (రవి మోహన్), ఆర్తిల విడాకులు.అయితే, ఈ విడాకులకు పాప్ సింగర్ కేనిషా ఫ్రాన్సిస్ కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.  లీగల్ నోటీసులు పంపినా ఆగని ఈ నెగిటివిటీపై లేటెస్ట్ కేనిషాస్పందించారు. సోషల్ మీడియా వేదికగా రెండు వీడియోను రిలీజ్ చేశారు. తన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలను బయటపెడుతూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చిన్నప్పుడే లైంగిక వేధింపులు..

తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ, అసలు తనేంటో సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు కేనిషా. నేనేంటో వ్యక్తిగతంగా ఎరుగని వారు కూడా నాపై విషం చిమ్ముతున్నారు. నా గతమేంటో మీకు తెలుసా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2013లో నా తల్లిని, 2017లో నా తండ్రిని కోల్పోయి అనాథనయ్యాను. అంతకంటే ఘోరం ఏంటంటే.. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే నా సొంత బంధువుల నుండే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. 18 ఏళ్లకే జీవితం తెలియని వయసులో పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నా బిడ్డను కూడా కోల్పోయాను. ఆ నరకం నుండి బయటపడటానికి నాకు చాలా ఏళ్లు పట్టింది అని కేనిషా సంచలన విషయాలు వెల్లడించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Keneeshaa (@keneeshaa1)

 

రవి మోహన్ చిన్న పిల్లాడు కాదు..

జయం రవితో తనకున్న స్నేహంపై వస్తున్న వార్తలను కేనిషా తీవ్రంగా ఖండించారు. నా జీవితంలో ఇంత పెయిన్ అనుభవించిన నేను.. ఒక తండ్రిని తన పిల్లల నుండి వేరు చేయాలని చూస్తానా? అంత క్రూరత్వమా నాకు ఆపాదిస్తున్నారు? రవి మోహన్ ఏమైనా చిన్న పిల్లాడా? ఎవరితో మాట్లాడాలి, ఎలా బతకాలి అనేది ఆయనకు తెలియదా? ఆయన సొంత నిర్ణయాలు తీసుకోగలరు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇదేనా మీ సంస్కృతి?

సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కెమెరా ముందుకు వచ్చి పక్కవారి వ్యక్తిగత జీవితాలపై గాసిప్స్ రాయడం కంటే సమాజంలో మాట్లాడటానికి చాలా సమస్యలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రపంచంలో ఎంతోమంది పేదరికం, తిండి లేక అల్లాడుతున్నారని, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారని.. చేతనైతే వారి కోసం మాట్లాడాలని నెటిజన్లకు హితవు పలికారు.

►ALSO READ | Prabhas : 'స్పిరిట్' సెట్స్ నుండి ప్రభాస్ లుక్ లీక్.. ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్!

ఈ ఎమోషనల్ అండ్ బోల్డ్ వీడియో స్టేట్‌మెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక పెద్ద డిబేట్‌కు దారితీసింది. కొందరు ఆమె గతాన్ని చూసి సింపతీ ప్రకటిస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వివాదంలో ఇంకా ఏదో దాగి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రవి మోహన్ డివోర్స్ ఇష్యూలో కేనిషా ఒక పెద్ద సెన్సేషన్ గా మారింది. అయితే ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Keneeshaa (@keneeshaa1)