
సినీ పరిశ్రమల్లో ఉన్న గొప్ప గాయకుల్లో మనో ఒకరు. ఆయన పాడిన ఎన్నో పాటలు యువతను అలరించాయి. సూపర్ హిట్ అయ్యాయి. అందుకు గాను రిచ్ మండడ్ గాబ్రియేల్ యూనివర్సిటీ సింగర్ మనోకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. సినీ సంగీత పరిశ్రమకు ఆయన చేస్తున్న సేవలకు గౌరవంగా ఈ అవార్డును అందించింది. ఈ విషయాన్ని మనో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
భారతీయ సంగీత పరిశ్రమలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా 38 ఏళ్లలో 15 భాషల్లో 25 వేలకు పైగా పాటలను అందించారు సింగర్ మనో. అందుకు గాను రిచ్ మంచ్ గాబ్రియల్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ఇచ్చింది.
14 ఏళ్ల వయసులోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎస్. విశ్వనాథన్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిన మనో.. ఆ తర్వాత మరో సంగీత దిగ్గజం చక్రవర్తి దగ్గర పనిచేశారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతు 1985లో సింగర్ గా మారారు.