గుండెపోటు సింగర్ మృతి

గుండెపోటు సింగర్ మృతి

ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మహపాత్ర పాట పాడుతూ మృతి చెందాడు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దుర్గా పూజలో భాగంగా  సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మురళీ మహపాత్ర పాటలు పాడుతుండగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయన్ను ఆసుపత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. గుండెపోటు వల్లే మురళీమహపాత్ర చనిపోయినట్లు అతని సోదరుడు బిభూతి ప్రసాద్ మహపాత్ర తెలిపారు.

జైపూర్ పట్టణంలోని రాజనహర్ పూజా మండపంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో  మోహపాత్ర ప్రదర్శన ఇచ్చాడు. మొత్తం నాలుగు పాటలు పాడాక.. వేదికపై కుర్చీపై కూర్చోని ఇతర గాయకుల మాటలు వింటున్నాడు. ఈ సమయంలో కుర్చోలో నుంచే ఒక్కసారిగా  కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించాడు. గాయకుడు మురళి మృతి వార్తతో  ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అక్షయ మొహంతి అని పిలుస్తారు..
మురళీ మోహపాత్ర జైపూర్ కు చెందిన వ్యక్తి. అతన్ని అభిమానులు  అక్షయ మొహంతి అని కూడా పిలుస్తారు.  మోహపాత్ర పాటలు పాడుతూనే.. జైపూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.ఆయన తొమ్మిది నెలల తర్వాత సర్వీస్ నుండి పదవీ విరమణ చేయబోతున్నాడు. 

నవీన్ పట్నాయక్ సంతాపం..
మురళీ మహపాత్ర మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. “ప్రముఖ గాయకుడు మురళీ మహపాత్ర మరణ వార్త విని  చాలా బాధపడ్డాను. ఆయన మధురమైన గాత్రం శ్రోతల హృదయాలను ఎప్పటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. అతని ఆత్మకు శాంతి కలగాలి. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని ఒడియాలోని ట్విట్టర్ పోస్ట్‌ చేశారు.