
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగిస్తున్నారు. ఆ ప్రయోగాలు విజయవంతమవుతున్నట్లు తెలుస్తోంది. వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ కనిపెట్టడానికి చైనాలోని ఔషధ తయారీ సంస్థ సినోవ్యాక్ బయోటెక్ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం..కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు కొన్నికంపెనీలు పోటీపడుతున్నాయి. వాటిలో కొన్ని కంపెనీలో వ్యాక్సిన్ తయారు చేసి మనుషులపై పలు దశల వారీగా ప్రయోగిస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ను మనుషులపై జరిపే ప్రయోగంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్, బయోన్ టెక్, జాన్సన్ & జాన్సన్, మెర్క్, మోడెర్నా, సనోఫీ తో పాటు చైనాకు చెందిన సినో వ్యాక్ ముందు వరసలో ఉన్నాయి.
వాటిలో సిని వ్యాక్ సంస్థ రెండో దశలో కరోనా వ్యాక్సా పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను 743మందిపై ప్రయోగించినట్లు తెలిపింది. 743మందికి తాము తయారు చేసిన టీకా ఇచ్చిన 14రోజుల తరువాత 90శాతం మందిలో కరోనా వైరస్ పోరాడే యాంటీ బాడీలు ఉత్పన్నం అవుతున్నట్లు స్పష్టం చేసింది. రెండో దశలో మనుషుల పై చేసిన టీకా ప్రయోగంలో ఎలాంటి సమస్యలు లేవని తేల్చింది. అందుకే మూడో దశ ప్రయోగం విదేశాల్లో చేయనున్నట్లు తెలిపింది. ఇందు కోసం బ్రెజిల్ కు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది.
బ్రెజిల్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ బుటాంటన్ మరియు సినోవాక్ ఆధ్వర్యంలో 9వేల మందిపై ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే బ్రెజిల్ ఔషద కంపెనీకి లైసెన్స్ ఇచ్చి సినోవాక్ తన డ్రగ్ తొలత దక్షిణ అమెరికా దేశంలో అందుబాటులో ఉంచనుతున్నట్లు సమాచారం. చైనా డ్రగ్స్ సంస్థ సినోవాక్ ప్రకటించింది.