సింక్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ లో గుకేశ్‌‌‌‌, ప్రజ్ఞా గేమ్‌‌‌‌ లు మళ్లీ డ్రానే

సింక్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ లో  గుకేశ్‌‌‌‌, ప్రజ్ఞా గేమ్‌‌‌‌ లు మళ్లీ డ్రానే

సెయింట్‌‌‌‌ లూయిస్‌‌‌‌ (అమెరికా): ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్లు డి. గుకేశ్‌‌‌‌, ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద.. సింక్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో మళ్లీ డ్రాతో సరిపెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్‌‌‌‌లో గుకేశ్‌‌‌‌.. మ్యాక్సిమ్‌‌‌‌ వాచిర్‌‌‌‌ లాగ్రెవ్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌)తో, ప్రజ్ఞానంద.. శామ్యూల్‌‌‌‌ సెవియన్‌‌‌‌ (అమెరికా)తో జరిగిన గేమ్‌‌‌‌లను డ్రాగా ముగించారు. దీంతో ఇద్దరి ఖాతాలో చెరో అర పాయింట్‌‌‌‌ చేరింది. తెల్లపావులతో క్వీన్‌‌‌‌ గాంబిట్‌‌‌‌ స్ట్రాటజీని ఎదుర్కొన్న ప్రజ్ఞా.. సెవిలియన్‌‌‌‌కు ఎటువంటి సమస్యలను కలిగించలేదు. 

మిడిల్‌‌‌‌ గేమ్‌‌‌‌లో చాలా పావులు చేతులు మారడంతో గేమ్‌‌‌‌ డ్రా వైపు వెళ్లింది. తెల్ల పావులతో ఆడిన గుకేశ్‌‌‌‌.. లాగ్రేవ్‌‌‌‌ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. గేమ్‌‌‌‌ ప్రారంభంలోనే క్వీన్స్‌‌‌‌ ట్రేడ్‌‌‌‌ అయ్యాయి. అయినప్పటికీ ఇద్దరు ప్లేయర్లు తమ స్ట్రాటజీలతో గేమ్‌‌‌‌ను కాపాడుకున్నారు. ఫలితంగా రూక్‌‌‌‌ ఎండ్‌‌‌‌ గేమ్‌‌‌‌లో ఇద్దరి వద్ద ఒక్కో పాన్‌‌‌‌ ఉండటంతో గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు. 

ఇతర గేమ్‌‌‌‌ల్లో ఫ్యాబియానో కరువాన (అమెరికా).. నొడిర్బెక్‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌)పై గెలవగా, వెస్లీ సో (అమెరికా).. అలీరెజా ఫిరౌజ (ఫ్రాన్స్‌‌‌‌), లెవోన్‌‌‌‌ అరోనియన్‌‌‌‌ (అమెరికా).. డుడా జాన్‌‌‌‌ క్రిస్టోఫ్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌) మధ్య జరిగిన గేమ్‌‌‌‌లు డ్రా అయ్యాయి. ఈ రౌండ్‌‌‌‌ తర్వాత కరువాన 3 పాయింట్లతో టాప్‌‌‌‌లో ఉండగా, ప్రజ్ఞానంద 2.5, గుకేశ్‌‌‌‌ 2 పాయింట్లతో కొనసాగుతున్నారు.