రూ.75 కోట్లు వసూలు చేసిన సార్ మూవీ

రూ.75 కోట్లు వసూలు చేసిన సార్ మూవీ

తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన సార్ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సార్ సినిమా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి చెప్పడం. మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించడం, ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా మరింత విజయం సాధించింది. కాగా, ఈ సినిమా తెలుగు,తమిళ్ లో కలుపుకొని 9 రోజుల్లో 75 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

‘జీరో ఫీ జీరో ఎడ్యుకేషన్ .. మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్’ అనే కాన్సెప్టును కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు ఆచరణలోకి తెచ్చారు. ఈ కారణంగా ఎక్కువ ఫీజులు చెల్లించేలేని సామాన్య విద్యార్థులు చదువుకు దూరమవుతూ ఉన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక లెక్చరర్ చేసిన పోరాటమే ‘సార్’ సినిమా. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సార్ సినిమా తెరకెక్కించారు. ఇందులో మలయాళ బ్యూటీ సంయుక్త ధనుష్ కు జోడీగా నటించింది.