సిరాజ్ ఇన్ స్వింగర్..ఎగిరిపోయిన మిడిల్ వికెట్

సిరాజ్ ఇన్ స్వింగర్..ఎగిరిపోయిన మిడిల్ వికెట్

హైదరబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. ఫస్ట్ వన్డేలో అద్భుతమైన బౌలింగ్తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్..రెండో వన్డేలోనూ కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లుతో లంక బ్యాట్స్మన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. సెన్సేషన్ స్వింగర్తో లంక బ్యాట్స్మన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

 శ్రీలంక ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో సిరాజ్  ఓపెనర్ అవిష్కా ఫెర్నాండోను ఔట్ చేశాడు.  ఫెర్నాండో కదలికలను బట్టి సరైన ప్లేస్లో బంతివేసిన సిరాజ్..అతన్ని పెవీలియన్ చేర్చాడు. అద్భుతమైన  ఇన్‌స్వింగర్‌తో మిడిల్ వికెట్ లేపేసాడు. సిరాజ్ ఇన్ స్వింగర్ను  అర్థం చేసుకోలేకపోయిన  ఫెర్నాండో.. రెప్పపాటులో బంతి లోపలికి దూసుకొచ్చిన మిడిల్ వికెట్‌ను ఎగిరేసుకుపోవడంతో.ఒక్కసారిగా బిత్తరపోయి చూశాడు. 

https://twitter.com/mufaddal_vohra/status/1613457124558008320

ఈ మ్యాచ్లో సిరాజ్ మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 5.4 ఓవర్లు వేసిన సిరాజ్..30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో..శ్రీలంక 215 పరుగులకే ఆలౌట్ అయింది.