
ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జి చీట్ దాఖలు చేసింది సిట్. ఈ కేసులో సుదీర్ఘ కాలంగా విచారణ జరిపిన శనివారం ( జులై 19 ) ప్రిలిమినరీ చార్జిషీట్ దాఖలు చేసింది. 300 పేజీలు ఉన్న ఈ చార్జిషీట్ లో ఎంపీ మిథున్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. ఈ చార్జిషీట్ లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా రూ. 62 కోట్లు సీజ్ చేసినట్లు పేర్కొంది సిట్. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 268 మంది సాక్షులను విచారించినట్లు చార్జిషీట్ లో పేర్కొంది సిట్.
20 రోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది సిట్. లిక్కర్ స్కాం ద్వారా కొల్లగొట్టిన సొమ్ము వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని వెల్లడించింది సిట్. మద్యం ముడుపులు షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసారని.. బ్లాక్ ను వైట్ గా మార్చినట్లు గుర్తించామని పేర్కొంది సిట్. ఇదిలా ఉండగా.. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్రపై విచారణ ముమ్మరం చేసింది సిట్.ఈ క్రమంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది సిట్.
ఇటీవలే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను నిరాకరించడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు సిట్ అధికారులు. అయితే.. కోర్టు సిట్ కు అనుకూలంగా స్పందించలేదు. సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. కీలకమైన పత్రాలు జతచేయాలని కోరుతూ పిటిషన్ ను సిట్ కు తిరిగి పంపింది కోర్టు.
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. అయితే.. కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరించింది. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ మిథున్ రెడ్డికి బెయిల్ లభించలేదు. దీంతో మిథున్ రెడ్డి గత కొంతకాలంగా కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో దేశం విడిచిపోవద్దని లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్.