Phone tapping case: ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డికి సిట్ నోటీసులు

Phone tapping case: ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డికి సిట్ నోటీసులు
  • బుధ, శుక్రవారాల్లో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరిన సిట్

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసు దర్యాప్తులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డికి సిట్‌‌ శుక్రవారం రాత్రి నోటీసులిచ్చింది. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌‌ పీఎస్‌‌లోని సిట్‌‌ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. అయితే, శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్​రావు బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో రాలేనని మహేశ్వరెడ్డి సిట్ అధికారులకు తెలిపారు. దీంతో బుధ లేదా శుక్రవారాల్లో ఏదైనా ఒక రోజు వచ్చి సాక్షిగా స్టేట్‌‌మెంట్‌‌ ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. కాగా, తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యిందని ఓ ఐజీ చెప్పినట్టు గత నెల 27న మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.