
ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్రపై విచారణ ముమ్మరం చేసింది సిట్.ఈ క్రమంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది సిట్. ఇటీవలే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను నిరాకరించడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు సిట్ అధికారులు. అయితే.. కోర్టు సిట్ కు అనుకూలంగా స్పందించలేదు. సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. కీలకమైన పత్రాలు జతచేయాలని కోరుతూ పిటిషన్ ను సిట్ కు తిరిగి పంపింది కోర్టు.
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. అయితే.. కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరించింది. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ మిథున్ రెడ్డికి బెయిల్ లభించలేదు. దీంతో మిథున్ రెడ్డి గత కొంతకాలంగా కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో దేశం విడిచిపోవద్దని లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్.
మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ నిరాకరణతో సిట్ మరింత దూకుడు పెంచింది. మిథున్ రెడ్డి ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించేందుకు సిట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన పాత్రలతో మళ్ళీ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది సిట్. ఈ క్రమంలో సిట్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.