సీతా కళ్యాణ వైభోగమే మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ విడుదల

సీతా కళ్యాణ వైభోగమే మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ విడుదల

సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఏప్రిల్ 26న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయించారు.  టీజర్ చాలా బాగుందని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ ఆయన బెస్ట్ విషెస్ చెప్పారు.

ఇక టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తీసిన లవ్, యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. హీరోయిన్ ఇంటి నుంచి హీరోతో వెళ్లిపోవడం, ‘సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు.. గుడిని మూసేయండి’ అని చెప్పే డైలాగ్‌‌‌‌‌‌‌‌ను బట్టి ఈ రెండింటి నేపథ్యంలో జరిగే కథ అని అర్థమవుతోంది. అన్ని కమర్షియల్ అంశాలతో కుటుంబమంతా కలిసి చూసేలా తీశామని దర్శకనిర్మాతలు తెలియజేశారు. గగన్ విహారి, నాగినీడు, శివాజీరాజా, ప్రభావతి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.