
తొలిప్రేమ సినిమాతో సైలెంట్ గా వచ్చి యూత్ ను తన వైపుకు తిప్పుకున్నాడు వెంకీ అట్లూరి. టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఇతనూ ఒకడు. కెరీర్ తొలొనాళ్లలో ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత, స్నేహ గీతం వంటి సినిమాలతో రచయితగా నిలదొక్కుకున్నాడు. తర్వాత దర్శకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇటీవల నితిన్ తో రంగ్ దే, ధనుష్ తో సార్ సినిమాలు తెరకెక్కించాడు. తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. చివరి రెండు సినిమాలు నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ వారే ఈ సినిమాను నిర్మించడం విశేషం. వెంకీ బర్త్ డే సందర్భంగా సితార సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ డైరెక్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ముచ్చటగా మూడో సినిమాను ఈ దర్శకుడితో తీయడం సంతోషంగా ఉందని ప్రకటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కి ఇది సిస్టర్ బ్యానర్ లాంటిది. రెండింటినీ నిర్మాత నాగవంశీనే నిర్వహిస్తున్నాడు. ఈ కొత్త సినిమాకు సంబంధించిన మిగతా విషయాలు వెల్లడించాల్సి ఉంది.