
బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయి.. నేరాల నియంత్రణలో నితీష్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం చాలా బాధగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారింది..పరిపాలనా వైఫల్యానికి అధికారుల అసమర్థత,నేరస్థులతో కుమ్మక్కవడమే కారణమని అన్నారు చిరాగ్ పాశ్వాన్. "ఇటీవల హింసాత్మక నేరాలు పెరగడానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం ఉందని, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ, శాంతిభద్రతలను అదుపులో ఉంచడం పరిపాలన బాధ్యత. ఈ విషయంలో విఫలమవుతున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం నాకు బాధగా ఉంది" అని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.
ALSO READ | తేజస్విని చంపేందుకు జేడీయూ, బీజేపీ కుట్ర ..బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ సంచలన ఆరోపణలు
చిరాగ్ నితీష్‌ను విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. 2020లో బీహార్‌లో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో, చిరాగ్ కూడా అలాగే ఆరోపణలు చేశారు. జనతాదళ్-యునైటెడ్ (జెడి-యు)కి నితీష్ కి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టాడు. ఈసారి కూడా ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలని చిరాగ్ సూచించాడని తెలుస్తోంది.
బీహార్ లో అత్యాచారం, హత్య, కిడ్నాప్ ,దోపిడీ వంటి సంఘటనలు వరసగా జరుగుతున్నాయి.. అయినా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో రాష్ట్ర అధికారులు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి.. పరిస్థితి దాదాపు అదుపు తప్పింది.. వెంటనే లా అండ్ ఆర్డర్ చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు చిరాగ్ పాశ్వాన్.