స్పై బ్యాచ్ కొత్త సినిమా.. అధికారికంగా ప్రకటించిన శివాజీ.. టైటిల్ ఏంటో తెలుసా?

స్పై బ్యాచ్ కొత్త సినిమా.. అధికారికంగా ప్రకటించిన శివాజీ.. టైటిల్ ఏంటో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచినా విషయం తెలిసిందే. నిజానికి చాలా మంది ఈ సీజన్ లో శివాజీ విన్నర్ అవుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే సీజన్ 7 గురించి మాట్లాడుకోవాలంటే ముందు స్పై బ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి, శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్.. ఈ ముగ్గురి బాండ్ జనాలకు చాలా నచ్చింది. ఎంతలా అంటే.. ఈ ముగ్గురిలో ఎవరు విన్ అయినా మాకు ఒకే అని వల్ల ఫ్యాన్స్ అనుకునేంతలా. 

అందుకే ఈ ముగ్గురికి స్పై అంటే పేరు పెట్టి ట్రెండ్ చేశారు వాళ్ల ఫ్యాన్స్. దాంతో స్పై బ్యాచ్ ఫుల్ ఫెమస్ అయ్యింది. ఇక బయటకు వచ్చాక కూడా ఈ ముగ్గురి బాండింగ్ అలాగే కొనసాగుతోంది. ఇటీవల యావర్, పల్లవి ప్రశాంత్ కలిసి శివాజీ ఏంటికి కూడా వెళ్లారు. అక్కడ చాలా ఎమోషనల్ మూమెంట్స్ కూడా జరిగాయి. అందులో భాగంగానే.. స్పై బ్యాచ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు నటుడు శివాజీ. 

ఈ ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడుతూ.. త్వరలో స్పై టీం యావర్‌, ప్రశాంత్‌లతో ఓ మూవీ చేస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆ సినిమా టైటిల్‌ కూడా స్పై. నా 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ప్రశాంత్‌, యావర్‌ల అంత బాండింగ్‌ ఎవరితోనూ ఏర్పడలేదు. కేవలం వాళ్ళకోసమే ఈ సినిమా చేస్తున్నాను. అయితే.. అది షార్ట్‌ ఫిలిమా, ఫుల్‌ సినిమానా అనేది త్వరలో వెల్లడిస్తాము. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు శివాజీ. ఈ విషయం తెలుసుకున్న స్పై బ్యాచ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి స్పై బ్యాచ్ తో మంచి అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.