తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'పరాశక్తి'. ఎన్నో వివాదాలు , అడ్డంకులు దాటుకుని జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా రాజకీయాల్లోనూ సెగలు పుట్టిస్తోంది. తమిళనాట ఈ మూవీని నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది..
వివాదానికి కేంద్ర బిందువు..
1965లో తమిళనాడును కుదిపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే, చరిత్రను వక్రీకరించారనే ఆరోపణలతో తమిళనాడు యూత్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ముఖ్యంగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని, అప్పటి కాంగ్రెస్ నాయకులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. తమిళనాడు యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ ఈ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
శివకార్తికేయన్ పాత్ర ఇందిరాగాంధీని కలిసే సన్నివేశాలు పూర్తిగా కల్పితం. చారిత్రక ఆధారాలు లేని ఘటనలను నిజమని నమ్మించేలా చిత్రీకరించారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని మండిపడ్డారు.
ఎదురుదెబ్బల పరంపర
‘పరాశక్తి’ ప్రయాణం మొదటి నుంచీ ముళ్ల బాటగానే సాగుతోంది. పాత క్లాసిక్ సినిమా పేరును వాడుకోవడంపై తొలుత వివాదం మొదలైంది. ఆతర్వాత ట్రైలర్‌లోని కొన్ని సంభాషణలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చిరకు కోర్టు మెట్లు కూడా ఎక్కింది. అన్ని అడ్డంకులు దాటి సినిమా విడుదలైంది. ప్రస్తుతం క్లైమాక్స్‌లో ఉన్న కొన్ని వివాదాస్పద సన్నివేశాలను తక్షణమే తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. తమిళ యూత్ కాంగ్రెస్ ఏకంగా సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తోంది.
►ALSO READ | Allu Arjun Lokesh Movie: పాన్ వరల్డ్ సూపర్ హీరో కథతో లోకేష్.. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై సంచలన అప్‌డేట్!
రాజకీయ Vs సినిమా
ఒకవైపు సుధ కొంగర తన మేకింగ్‌తో ప్రశంసలు అందుకుంటుంటే, మరోవైపు రాజకీయ సెగలు సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపేలా ఉన్నాయి. చరిత్రలో జరగని విషయాలను సినిమాటిక్ లిబర్టీ పేరుతో చూపించడం తగదని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ తప్పుడు చరిత్రను నిజమని నమ్మే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #BanParasakthi, #SupportParasakthi అనే హ్యాష్‌ట్యాగ్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. చిత్ర యూనిట్ ఈ వివాదాలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. సినిమాను నిషేధించాలనే డిమాండ్ బలపడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
காங்கிரஸ் கட்சியின் மாபெரும் வரலாற்றை சிதைக்கும் நோக்கத்துடன் எடுக்கப்பட்ட பராசக்தி திரைப்படத்திற்கு எதிராக தமிழ்நாடு இளைஞர் காங்கிரஸின் மாநில முதன்மை துணைத் தலைவர் திரு #ArunBhaskar அவர்கள் கண்டனத்தை தெரிவித்துள்ளார்.
— Asmathulla MBA., (@asmathwise) January 12, 2026
இந்த #Parasakthi திரைப்படத்தை தடை செய்ய வலியுறுத்தி… pic.twitter.com/pcHIfIrbxi
