
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శివ కార్తికేయన్. ఇటీవల ‘మహావీరుడు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న శివ.. త్వరలో ‘అయలాన్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. స్పేస్ షిప్ నుంచి ఏలియన్ కిందకి పడుతున్నట్లు కనిపిస్తున్న పోస్టర్‌ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవడంతో వాయిదా పడింది. సినిమా క్వాలిటీని పెంచడానికి మరికొంత సమయం తీసుకుంటున్నట్టు, వెయిటింగ్‌కు తగిన రిజల్ట్ దక్కుతుందని, థియేటర్స్‌లో ప్రేక్షకులు సెలబ్రేషన్స్ చేసుకుంటారని చెబుతున్నారు మేకర్స్.
అక్టోబర్‌లో టీజర్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనుంది. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో ఆర్.డి.రాజా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.