Sivakarthikeyan : 'మదరాసి'తో శివకార్తికేయన్ రికార్డులు బద్దలు కొట్టేనా? టార్గెట్ రీచ్ అవ్వాలంటే..

Sivakarthikeyan : 'మదరాసి'తో శివకార్తికేయన్ రికార్డులు బద్దలు కొట్టేనా? టార్గెట్ రీచ్ అవ్వాలంటే..

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'మదరాసి'తో శివకార్తికేయన్ రికార్డులు బద్దలు కొట్టేనా? టార్గెట్ రీచ్ అవ్వాలంటే.. '. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  తొలిసారిగా ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగ దాస్ తో కలిసి శివకార్తికేయన్ పనిచేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్స్‌తో అభిమానుల అంచనాలు అమాంతం పెంచేసింది.

 బడ్జెట్ అంచన.. 
భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'మదరాసి' మూవీ  శివకార్తికేయన్ కెరీర్‌లో ఒక మైలురాయి కానుందని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాను సుమారు రూ150 కోట్లతో తెరకెక్కించినట్లు సమాచారం. శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని మాస్ పాత్రలో ఈ చిత్రంలో  కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. 'వేలైక్కారన్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, ఈ సినిమాతో శివకార్తికేయన్ తన అభిమానులను మెప్పించనున్నారన్న ధీమా వ్యక్తం అవుతోంది.

బాక్సాఫీస్ గెలుపుకు ఫార్ములా
అయితే ఈ 'మదరాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలంటే కొన్ని కీలక లక్ష్యాలను  చేరుకోవాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ  సినిమా ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.150 కోట్ల నుంచి రూ200 కోట్ల మేర వసూళ్లు రాబట్టితేనే లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే సినిమా రూ. 50 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. భారీ బడ్జెట్ కారణంగా కలెక్షన్లలో  కూడా ఆ స్థాయిలో పెరుగుదల చాలా అవసరమని చెబుతున్నారు.

పోటీ - సవాళ్లు
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'కూలీ' లాంటి చిత్రాలు పోటీలో లేవు. ఇది 'మదరాసి' మూవీకి కలిసి వస్తుంది. అయితే ఇటీవల  ఏ.ఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటించిన' సికిందర్ ' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో 'మధరాసి'పై కూడా దీని ఎఫెక్ట్ కొంత చూపించే ప్రభావం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.  ఈ మూవీ తొలి రోజున మంచి పాజిటివ్ టాక్ వస్తే సరే సరి.. లేకపోతే ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. 

 'అమరన్' రికార్డును మించుతాడా?
ఈ మూవీలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది. విలన్ గా విద్యుత్ జమ్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించింది. శివకార్తికేయన్ గత చిత్రం 'అమరన్' ప్రపంచవ్యాప్తంగా రూ.335 కోట్ల మేర వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.  శివకార్తికేయన్ స్టార్ పవర్‌తో పాటు, మురుగదాస్ దర్శకత్వంపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం ఈ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుందంటున్నారు అభిమానులు. 'మదరాసి' నిజంగా శివకార్తికేయన్ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా అని వేచి చూడాలి.