
తమిళ హీరో శివకార్తికేయన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో తెలుగులో ప్రిన్స్ సినిమాలో నటిస్తున్నాడు. జాతిరత్నాలు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనుదీప్ కెవీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మరియా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఏకకాలంలో రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్, శాంతిటాకీస్ బ్యానర్స్ పై ఈ చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రిన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా వదిలారు. ఈ సినిమా దీపావళికి విడుదలవుతుందని దర్శకుడు అనుదీప్ ఈ వీడియోలో ప్రకటించాడు. హీరో శివకార్తికేయన్, హీరోయిన్ మరియా, సత్యరాజ్, దర్శకుడు అనుదీప్ల సరదా సంభాషణతో నిండిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Diwali 2022 is going to be brighter with the arrival of #Prince ???#PrinceForDiwali ?????
— Aditya Music (@adityamusic) June 21, 2022
▶️https://t.co/pWaRHfvjBW
Audio on @adityamusic ?@Siva_Kartikeyan #Sathyaraj @anudeepfilm#MariaRyaboshapka @Premgiamaren @MusicThaman @manojdft @Cinemainmygenes @SVCLLP pic.twitter.com/QbzThh4PrL