రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి

ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరోకరు గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఎటావా నుంచి కొంతమంది రైతులు జాక్‌ఫ్రూట్ పండ్లను ట్రక్కులో మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు రాత్రి ఎటావాలోని ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో అదుపుతప్పి మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు అక్కడికక్కడే చనిపోగా.. మరో రైతు గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని సైఫాయ్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు ఎటావా ఎస్సీ ఆర్. సింగ్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకొని.. ప్రమాదానికి కారణమైన వాహనాలను తొలగించి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.

రోడ్డు ప్రమాదంలో రైతుల మృతిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ స్పందించారు. ప్రమాదంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన మరో రైతుకు రూ. 50 వేల సాయాన్ని ప్రకటించారు.

For More News..

తన నిర్ణయాన్ని సమర్థించుకున్న డోనాల్డ్ ట్రంప్