బీఆర్ఎస్ చేసిన డెవలప్​మెంట్ ​శూన్యం : సుదర్శన్​రెడ్డి​

బీఆర్ఎస్ చేసిన డెవలప్​మెంట్ ​శూన్యం : సుదర్శన్​రెడ్డి​

నవీపేట్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్​బోధన్ అభ్యర్థి సుదర్శన్​రెడ్డి వాపోయారు. సోమవారం ఆయన నవీపేట్​ మండలంలోని కోస్లీ, ఫకీరాబాద్, మిట్టాపూర్, యాంచ, అల్జాపూర్, నందిగామ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​ హయాంలో పేద పిల్లలకు ట్రిపుల్​ఐటీలు కట్టిస్తే, బీఆర్ఎస్ ​ప్రభుత్వం పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్​పర్సన్​పద్మ, కౌన్సిలర్​శరత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీలు రామచందర్, లీడర్లు బాల్ రాజ్ గౌడ్, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.