
మామల్లపురం : చెస్ ఒలింపియాడ్‌లో బరిలో నిలిచిన ఇండియా ఆరు జట్లు హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లోనూ ఓపెన్, విమెన్స్ టీమ్స్ నెగ్గాయి. యంగ్‌స్టర్స్‌తో కూడిన ఇండియా మెన్స్ రెండో టీమ్ మరో క్లీన్‌స్వీప్ సాధించింది. ప్రజ్ఞానంద, గుకేశ్, నిహాల్, రౌనక్ తమ గేమ్స్‌లో నెగ్గడంతో ఇండియా–2 టీమ్ 4–0తో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసింది. ఇండియా ప్రధాన జట్టు 3–1తో గ్రీస్‌ను ఓడించింది.
హరికృష్ణ, ఎరిగైసి అర్జున్ తమ గేమ్స్‌లో నెగ్గారు. ఇండియా మూడో టీమ్ కూడా 3–1తో ఐస్‌లాండ్‌పై గెలిచింది. విమెన్స్‌లో ఇండియా మెయిన్ టీమ్ 3–1తో ఇంగ్లండ్‌ను ఓడించింది. హారిక, తానియా తమ గేమ్స్‌ను డ్రా చేసుకోగా.. వైశాలి, భక్తి కులకర్ణి నెగ్గారు. ఇండియా–2 టీమ్ 3–1తో ఇండోనేసియాపై నెగ్గగా, మూడో జట్టు 2.5–1.5 తేడాతో ఆస్ట్రియాపై గెలిచింది.