ఆరు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు సిక్సర్లు

ఆరు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు సిక్సర్లు
  •     నేపాల్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపేంద్ర సింగ్ రికార్డు

అల్ అమరత్ (ఖతార్) :  నేపాల్ హార్డ్ హిట్టర్ దీపేంద్ర సింగ్ ఐరీ  ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యువరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్, కీరన్ పొలార్డ్ సరసన  నిలిచాడు. ఏసీసీ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా  ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కమ్రాన్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దీపేంద్ర ఆరు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిక్సర్లుగా మలిచాడు.

దాంతో నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 32 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. తొలుత ఆ టీమ్ 20 ఓవర్లకు 210/7 స్కోరు చేసింది. దీపేంద్ర (21 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 64  నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్​గా నిలవగా,  ఓపెనర్ ఆసిఫ్ షేక్ (52) కూడా ఫిఫ్టీతో రాణించాడు.  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖతార్ 20 ఓవర్లలో 178/9   స్కోరు మాత్రమే చేసి ఓడింది. కెప్టెన్ ముహమ్మద్ తన్వీర్ (63) పోరాడాడు. కాగా

దీపేంద్ర సింగ్ వరుసగా ఆరు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి. గతేడాది ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగోలియాపై  రెండు ఓవర్ల వ్యవధిలో వరుసగా ఆరు సిక్సర్లు రాబట్టాడు. దాంతో  రెండు ఇంటర్నేషనల్ టీ20ల్లో ఆరు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.