రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్

రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్

కరోనా కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారా ఈ వేరియంట్  దేశంలోకి సోకే ప్రమాదముండటంతో.. కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారికి ఆంక్షలు విధించింది. తాజాగా ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి  వచ్చిన 11 అంతర్జాతీయ విమానాలు దేశవ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులలో ల్యాండ్ అయ్యాయి. ఆ విమానాలలో 3476 మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. వీరందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా.. వారిలో ఆరుగురికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. దాంతో ఈ ఆరుగురిని క్వారంటైన్ లో ఉంచారు. 

బుధవారం తెల్లవారుజామున నెదర్లాండ్స్, యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన నలుగురు ప్రయాణికులకు కోవిడ్–19 పాజిటివ్ అని తేలింది. అయితే వీరికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిందో లేదో తెలుసుకోవడానికి వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఈ నలుగురిని ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేర్చారు.