సికింద్రాబాద్లో ఆరేళ్ల చిన్నారి అదృశ్యం

సికింద్రాబాద్లో ఆరేళ్ల చిన్నారి అదృశ్యం

సికింద్రాబాద్ : మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారి అదృశ్యమైంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారి ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాప కోసం వెతుకుతున్నారు. 

పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు  కొనసాగిస్తున్నారు. అందులో పాప ఓ వ్యక్తి తో వెళ్ళినట్టు కనిపించడంతో అప్రమత్తమయ్యారు. సదరు వ్యక్తిని స్థానిక మెస్ యజమాని రోజువారీ కూలీ కోసం అడ్డా నుంచి తీసుకువచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అయితే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలేవీ తీసుకోకుండానే పనిలోకి తీసుకోవడంపై చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.