భారత మార్కెట్‌లోకి రానున్న కొత్త ఎస్‌యూవీ కార్లు ఇవే..

 భారత మార్కెట్‌లోకి రానున్న కొత్త ఎస్‌యూవీ కార్లు ఇవే..

ఇండియన్​ మార్కెట్లోకి కొత్తగా రెండు మోడల్స్​ కార్లు లాంఛ్​ కానున్నాయి.  కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఆటోమొబైల్స్​ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు  ఉన్న  డిమాండ్ అంతా ఇంతాకారు.  ఇప్పటికే ఈ వెహికల్స్​ సేల్స్​లో  గణనీయమైన వృద్ధిని సాధించాయి. . ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన కంపెనీలు సైతం ఎస్‌యూవీ వాహనాల తయారీపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. అనేక విదేశీ కంపెనీలు సైతం దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి . తాజాగా దేశంలోని రెండు ప్రముఖ ఆటోమేకర్లు స్కోడా, కియా రెండు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి. 

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ

స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ .. భారత రోడ్లపై పరీక్షించింది. వచ్చే ఏడాది మార్చిలో దీన్ని లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీ డిజైన్‌ను స్పై షాట్‌లలో వెల్లడించారు. ఇందులో ఇన్‌వర్టెడ్ ఎల్-ఆకారపు LED టెయిల్ ల్యాంప్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన చిన్న రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి.

ఎమ్‌క్యూబి ఎవో ఇన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.0-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో  115 bhp, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కోడా తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లలో వస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం కొత్త స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి జనవరి 2025 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కియా క్లావిస్

కియా క్లావిస్ 2024 చివరి నాటికి భారతదేశంలో లాంచ్ అయే అవకాశాలు ఉన్నాయి.  అయితే దాని మార్కెట్ లాంచ్ వచ్చే ఏడాది అంటే 2025‌లో ప్రారంభం కానున్నట్లు కియా ఇండియా తెలిపింది. కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రాండ్ లైనప్‌లో సోనెట్, సెల్టోస్ మోడల్ మాదిరిగా ఉండవచ్చు . కియా క్లావిస్ టెస్టింగ్ మోడల్ ఇటీవలే భారతదేశంలో పరీక్షించబడింది.

మొత్తంమీద కియా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ కొత్త క్లావిస్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురానుంది. అందులో అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ వెహికల్ ఇంటీరియర్‌లో AY అనే కోడ్‌నేమ్ ఉంటుంది. . ఇది హైబ్రిడ్ వెర్షన్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమచారం. కియా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్, పెట్రోల్-పవర్ రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం.