ఆకాశంలో  హోటల్

ఆకాశంలో  హోటల్

ఆకాశంలో మేఘాలపైన తిరుగుతూ, కొన్నేండ్ల పాటు కిందకు దిగాల్సిన అవసరం లేని హోటల్​ను ఎక్కడైనా చూశారా? అసలు అలాంటి హోటల్ సాధ్యమేనా అనుకుంటున్నారా? సాధ్యమే అంటున్నాడు యెమెన్​ సైంటిస్ట్​ హషీమ్​ అల్​‌‌‌‌–గైలి. అంతేకాదు, తాను తయారు చేయాలనుకుంటున్న ‘స్కై క్రూయిజ్​’ హోటల్​ డెమో వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది నెటిజన్లను ఆకట్టుకొని, వైరల్ అవుతోంది. ఈ క్రూయిజ్​ పెద్ద జంబో విమానంలా ఉంటుంది. దీనికి న్యూక్లియర్​తో పనిచేసే 20 ఇంజిన్లు ఉంటాయి. కొన్నేండ్ల పాటు ఈ క్రూయిజ్​ కిందకు దిగాల్సిన అవసరం ఉండదు. అలాగే, చిన్న చిన్న రిపేర్​లు ఏమైనా వస్తే పైనే చేసుకోవచ్చు. ఐదువేల మంది ఒకేసారి డిన్నర్ చేయొచ్చు. లగ్జరీ హోటల్​లో ఉండే సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయి. తోక భాగంలో పైన పెద్ద హాల్​ ఉంటుంది. ఇందులో గెస్ట్​లు 360 డిగ్రీల యాంగిల్​లో ఆకాశం అందాలు చూడొచ్చు. ఎంటర్​టైన్​మెంట్​ హాల్​లో షాపింగ్​ మాల్స్​, స్పోర్ట్స్​ సెంటర్​, స్విమ్మింగ్​ పూల్స్​, రెస్టారెంట్స్​, కిడ్స్​ ప్లేగ్రౌండ్స్, థియేటర్స్​ ఉంటాయి. బిజినెస్​ మీటింగులు, స్పెషల్​ ఈవెంట్లకు ప్రత్యేక సెక్షన్​తోపాటు వెడ్డింగ్​ హాల్ కూడా ఉంటుంది. ​‘స్కై క్రూయిజ్’​ వీడియోపై నెట్టింట్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు తిట్టిపోస్తున్నారు.