క్షణికావేశం ప్రాణాలు తీసింది..ASI ని గొంతు పిసికి చంపేసిన CRPF జవాన్

క్షణికావేశం ప్రాణాలు తీసింది..ASI ని గొంతు పిసికి చంపేసిన CRPF జవాన్

ఇద్దరు పోలీస్ డిపార్టుమెంటులో ఉద్యోగులే.. ఒకరు నొకరు ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు..ప్రస్తుతం లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు.. అంతా బాగానే గడుస్తోంది.. ఇంతలో ఏమైందో తెలియదు..ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ ముదిరింది..రోజంతా గొడవపడ్డారు..అర్థరాత్రి ఒక్కసారిగా కాల్పుల శబ్దం.. అంతే.. కట్ చేస్తే.. ఆమె శవమై కనిపించింది.. అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో CRPF జవాన్.. తనతో లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్న  మహిళా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI)ను హత్య చేశాడు. శుక్రవారం (జూలై18) రాత్రి కచ్ జిల్లా అంజర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

అరుణ నటు జాదవ్ (25), అంజర్ పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహిస్తున్నారు.నిందితుడు దిలీప్ సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో జవాన్. ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.అరుణ,దిలీప్ 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు .అప్పటి నుండి సహజీవనం చేస్తున్నారు. వారు సురేంద్రనగర్ జిల్లాలోని పక్క గ్రామాల నుంచి వచ్చినవారు కావడంతో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. 

శుక్రవారం రాత్రి అరుణ ,దిలీప్ అంజర్ లోని నివాసంలో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం తీవ్రం కావడంతో దిలీప్, అరుణను గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. తర్వాత దిలీప్ చేతి మణికట్టును కోసుకుని, ఫెనాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ఉదయం, దిలీప్ అంజర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తాను చేసిన నేరాన్ని ఒప్పుకుని లొంగిపోయాడు.

పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపారు.