సిటీలో ‘స్లీప్​ కంపెనీ’ ఎంట్రీ

సిటీలో ‘స్లీప్​ కంపెనీ’ ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ ​గ్రిడ్​ పరుపులు, దిండ్లు, చెయిర్లు తయారు చేసే ‘స్లీప్ కంపెనీ’ సిటీలో మొదటిస్టోర్​ను​ కొండాపూర్​లో శుక్రవారం ఓపెన్​ చేసింది.   ఈ సందర్భంగా కంపెనీ కో–ఫౌండర్​ హర్షిల్ సలోట్ మాట్లాడుతూ రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 25కు పైగా స్టోర్స్​ను మొదలుపెడతామని చెప్పారు. తమ స్మార్ట్ ​గ్రిడ్ ​టెక్నాలజీకి పేటెంట్​ ఉందని, ఈ పరుపులు అద్భుతమైన నిద్ర అనుభవాన్ని ఇస్తాయని చెప్పారు.

గడిచిన రెండేళ్లలో నాలుగు రెట్ల గ్రోత్​ సాధించామని, రాబోయే రెండేళ్లలో రూ.500 కోట్ల ఆదాయాన్ని టార్గెట్​గా పెట్టుకున్నట్టు చెప్పారు.  తమ ఆదాయంలో 45 శాతం వరకు దక్షిణాది మార్కెట్ నుంచే వస్తున్నదని అన్నారు. తమ పరుపుల ధరలు రూ.18 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటాయని చెప్పారు. తయారీ యూనిట్​ ముంబైలో ఉందని సలోట్​ వివరించారు. కంపెనీ ఇప్పటి వరకూ ఫైర్ సైడ్ వెంచర్స్ ద్వారా రూ.13.4 కోట్ల మేరకు నిధులు పొందింది.