హైటెక్ యుగంలో ప్రజలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకే జనాలు ఆఫీసుకు వెళ్లే టప్పుడు బస్సుల్లోనో.. ట్రైన్లలోనో కునుకు తీస్తు్ంటారు. అలానే ఓ యువకుడు ప్రయాణిస్తూ నిద్రపోతున్నాడు. ఆతరువాత ఏంజరిగిందో చూడండి.
ఎప్పుడన్నా నిమిషమో అర నిమిషమో ఖాళీ దొరికితే చాలు వెంటనే మొబైల్ పట్టుకుంటున్నారు. ఆరేళ్ల నుంచి అరవైయేళ్ల వరకు వ్యక్తులు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక యూత్ అయితే.. ఓ పక్క ఆఫీసులో ఒత్తిడి... మరో పక్క ఇంట్లో సమస్యలతో ఇతరత్రా కారణాలతో తగినంత నిద్ర పోవడం లేదు. అర్దరాత్రి వరకూ అలా మేల్కొని .. నిద్ర వచ్చినా కాని సరిగా నిద్రపోవడం లేదు. . ఇక ఉదయం హడవిడిగా లేచి.. తయారై ఆఫీసుకో.. లేదంటో ఇంకేదో పనికో వెళ్తున్నప్పుడు తాము వెళ్లే బస్సు, ఆటో, మెట్రోల్లో కునుకు తీస్తున్నారు.
ప్రయాణంలో నిద్రపోవడం సర్వసాధారణం. ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మంది పడుకుంటారు. అయితే కొన్నిసార్లు ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోవడం ప్రమాదకరం. దీంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా.. జనాలు ఆ విధానాన్ని ఆపడం లేదు. అయితే బస్సులో ఓ వ్యక్తి నిద్రపోతూ ఆకస్మాత్తుగా ఎలా కిందపడిపోయాడో ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Out of Context Human Race (@NoContextHumans) September 4, 2023
బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. అయితే అతని తల ఒక వైపుకు వణుకుతూ అతను పడిపోతాడు. దీంతో అతను పడిపోవడంతో బస్సులో పెద్ద శబ్దం వచ్చింది. ఇంతలోనే బస్సులో ఉన్న వాళ్లంతా ఏమైదంటూ అతని వైపు చూస్తుంటారు. కిందపడిన ఆ వ్యక్తి లేచి మళ్లీ తన సీట్లోకి వెళ్లి కూర్చుంటాడు. ప్రయాణంలో నిద్రపోవడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకే ఇలాంటి ప్రమాదాలు ఎదురవకుండా ఉండాలంటే మనిషికి ప్రతిరోజూ 8 గంటల నిద్ర అవసరం.