
అక్కడో గుర్రపు పందెం జరుగుతోంది. రేసు గుర్రాలు జోరు మీదున్నాయి. ఇంతలో ఓ గుర్రం తడబడి కిందపడింది. దానిపైనున్న పిల్లాడూ కిందపడ్డాడు. గుర్రం మాత్రం లేచిందే పరుగు అన్నట్టు లేచి దూసుకు పోయింది. కింద పడిన చిన్నోడూ తగ్గలేదు. వస్తున్న ఓ బైకును ఎక్కేశాడు. గుర్రం దగ్గరకు చేరుకున్నాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి గుర్రపు కళ్లేన్ ని పట్టుకోగానే ఆ బుడ్డోడు బైక్ పైనుంచి గుర్రంపైకి జంప్ చేశాడు. పరుగు లంఘించి విజేతగా నిలిచాడు.ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతోంది. కర్నాటకలోని బెంగళూరు జిల్లా చిక్కో డి తాలుకా కేరూరులో జరిగిందీ ఘటన. అరణ్య సిద్ ధే-శ్వర జాతర సందర్భంగా 8 కిలోమీటర్ల ఈ గుర్రపు పందెం నిర్వహించారు.
తల్లిదండ్రులు కూలీలు
గుర్రం పైనుంచి కింద పడ్డ ఆ పిల్లాడి పేరు లోకేశ్ సత్తిగెరి. బెల్గావి జిల్లాలోని గోకక్ తాలూకాలో ఉన్న వడ్డరహట్టి అతని ఊరు. లోకేశ్ తండ్రి బసప్ప, తల్లి లక్ష్మి. నలుగురు అన్నదమ్ముల్లో లోకేశ్ చిన్నోడు. తల్లిదండ్రులు ఇద్దరూ పని చేస్తే రోజుకు రూ.200 వస్తుంది. అందుకే కుటుంబాన్ని పోషించేందుకు ఆ తొమ్మిదేళ్ల చిన్నో డు బడికెళ్లకుండా గుర్రపు పందేల్లో పాల్గొంటున్నాడు.
ఇంటర్నెట్ లో బాహుబలిగా..
లోకేశ్ ను అందరూ ముద్దుగా జాకీ అని పిలుస్తారు. కానీ మనోడి స్టంట్‌తో ఇంటర్నెట్ మొత్తం బాహుబలి గా పొగిడేస్తోంది. అయినా అది లోకేశ్ కు సంతోషాన్నివ్వలేదు. ఎందుకంటే పందెం గెలిచినా నిర్వా హకులు రూ.3 వేలకు బదులు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చారు. మరో రూ. రెండు వేలు గుర్రం ఖర్చులకు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో గత మూడేళ్లలో నిర్వహించి న రేసుల్లో కనీసం పదింటిలో జాకీ గెలిచాడు. బెల్గా విదగ్గరి ప్రాంతాల్లో జరిగే వేడుకలకు లోకేశ్ ను తీసుకె-ళ్లేవాడినని, గుర్రపు స్వారీని, పందేలను చూసి బాగాఎంజాయ్ చేసేవాడని తండ్రి బసప్ప చెప్పాడు. దా-చుకున్న రూ.5 వేలతో గుర్రాన్ని కొనిచ్చాననన్నాడు.సిద్దయ్య కోచింగ్‌లో లోకేశ్ రాటుదేలాడని చెప్పాడు. ఓ రెండు రేసులు గెలిచాక జిల్లాలో బాగా ఫేమస్ అయ్యా డన్నాడు. గుర్రంపై నుంచి పడటం, లేవడం ఆచిన్నారికి మామూలే అని చెప్పాడు.
పందేలపై బెట్టింగ్ లు కూడా..
బెల్గావ్ జిల్లాలో వేడుకలు, ఉత్సవాలు బాగా జరుగుతుంటాయని, నెలలో దాదాపు 8 నుంచి 10 రేసులు నిర్వహిస్తుంటారని కోచ్ సిద్దయ్య వివరించాడు. గెలిచిన గుర్రానికి రూ.5 వేలు, రన్నరప్‌కు రూ. 3వేలు, మూడో స్థానంలో నిలిచి న వారికి రూ.2 వేలుఇస్తారన్నాడు. బెట్టింగ్ కూడా జరుగుతుంటుందనిచెప్పాడు. గుర్రంపై నుంచి కింద పడినప్పుడు కాళ్లూచేతులకు దెబ్బలు తగిలాయని, కానీ, ప్రైజ్‌మనీ ముందుఆ గాయాలు గుర్తు రాలేదని లోకేశ్ చెబుతున్నాడు.రేసు గెలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.కాగా, ప్రస్తుతం లోకేశ్ .. లక్ష్మీనగర్ కన్నడ స్కూల్‌లో చదువుతున్నాడు. నాలుగవ తరగతిలో చేరనున్నాడు.