జర్మనీలో కూలిన చిన్న విమానం

జర్మనీలో కూలిన చిన్న విమానం

బెర్లిన్: జర్మనీలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. స్టుట్ గార్ట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికులతో బయలుదేరిన చిన్న విమానం శనివారం కూలిపోయింది. విమానంలో ఎంత మంది ప్రయాణికులున్నరన్నది తెలియడం లేదు. అయితే మూడు మృతదేహాలు దొరికాయని పోలీసు వర్గాల సమాచారం. విమానం రాడార్ నుంచి అదృశ్యమయ్యే ముందు పైలట్ నుంచి తమకు ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ రాలేదని.. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదని విమానాశ్రయం ఏటీసీ అధికారులు చెబుతున్నారు. హపర్ ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన ఈ చిన్న విమానం స్టైనెన్ బ్రాన్ ప్రాంతంలో కూలిపోవడం కలకలం రేపింది. టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాల తర్వాత శిధిలాలు కనిపించాయని ఏటీసీ వర్గాలు చెబుతున్నాయి.