V6 News

చెత్త వేసేవారిని పట్టేస్తది...మూసాపేట్లో  సీసీ కెమెరాతో కూడిన సెన్సార్‌‌‌‌ ఏర్పాటు  

చెత్త వేసేవారిని పట్టేస్తది...మూసాపేట్లో  సీసీ కెమెరాతో కూడిన సెన్సార్‌‌‌‌ ఏర్పాటు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసాపేట్ హెచ్ పీ పెట్రోల్ బంక్ రూట్ లో రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించేందుకు సీఎంసీ చర్యలు చేపట్టింది. ఇక్కడ సీసీ కెమెరాతో కూడిన -సెన్సార్‌‌‌‌ ను ఏర్పాటు చేశారు.

ఈ కెమెరాలో ఉన్న మోషన్-సెన్సార్ టెక్నాలజీ ఎవరైనా అక్కడ చెత్త వేయడానికి ప్రయత్నిస్తే హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే, శానిటేషన్ అధికారులు తమ మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించొచ్చు.. ఈ ప్రక్రియను బుధవారం కమిషనర్ సృజన పరిశీలించారు.