బీహార్ లో స్మార్ట్ ఫోన్ తో వ్యవసాయం

బీహార్ లో స్మార్ట్ ఫోన్ తో వ్యవసాయం

బీహార్‌ లోని కైథాహీ గ్రామం. ఏటా కురుస్తున్న అకాల, వడగండ్ల వానలు, వరదలతో ఆ గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మార్చిలోనూ వడగండ్ల వాన ధాటికి కైథాహీతో పాటు పరిసర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో గోధుమకు నష్టం జరిగింది. కానీ ఈసారి అదృష్టవశాత్తు కైథాహీ గ్రామ రైతుమహాతో, అతని తోటి రైతులు వర్షమొచ్చే ఒక్కరోజు ముందే ఆవాలు, గోధుమ పంటలను కోశారు. కారణం సరైన సమయానికి ఆ రైతుల మొబైల్‌ ఫోన్లకు హెచ్చరిక మెసేజ్‌ లు రావడమే.ఆ రైతుల స్మార్ట్‌‌ ఫోనే వారికి శ్రీరామరక్ష అయింది.మొబైల్‌ లోని యాప్‌ కు రైతుల పంట భూములు జియో ట్యాగింగ్‌ చే సి ఉండటంతో వేసిన పంట ఎలా పెరుగుతోంది, పంటకు ఎలాంటి పద్ధతులుఉపయోగించాలి, దానికి ఏ టైంలో ఎలాంటి వ్యాధులొస్తాయి , రోజూవారి వాతావరణ వివరాలు అంతా ఫోనే చెప్పేస్తుంటుంది మరి. మొబైల్‌ డేటావేగం పెరగడం, స్మార్ట్‌‌ఫోన్‌ , ఇంటర్నెట్‌ డేటాధరలు తగ్గడం, 24 గంటలు కరెంటు అందుబాటులో ఉండటంతో బిహార్‌ లో వ్యవసాయంలో‘స్మార్ట్‌‌’ విప్లవం వచ్చింది. ఇండియన్‌ సిలికాన్‌వ్యాలీ బెంగళూరు నగరంలో డేటా వేగం ఎంత ఉంటుం దో బిహార్‌ లోని మారుమూల మంకౌలీ గ్రామం (దర్భందా)లోనూ అంతే స్పీడ్‌ నెట్‌ సౌకర్యం ఉంది. దీంతో నెట్‌ వాడకం పెరిగి స్మార్ట్‌‌ వ్యవసాయం ఎక్కువవుతోం ది.

ఆవుకు ఎందుకు జబ్బొచ్చిందో కూడా..

బెంగళూరుకు చెందిన ‘క్రాప్‌ ఇన్‌ ’ లాంటి స్టార్టప్‌ కంపెనీలు రూపొందిస్తున్న యాప్‌ లపై బిహార్‌ రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు.యాప్‌ లతో పాటు వెదర్‌ ఫోర్‌ కాస్టింగ్‌ కంపెనీ స్కైమెట్‌ , బిహార్‌ సస్టెయి నబుల్‌ లైవ్‌ లీ హుడ్‌ అండ్‌ అడాప్షన్‌ టు క్లైమేట్‌ చేంజ్‌ (ఎస్‌ ఎల్‌ ఏసీసీ)కూడా రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్నాయి. 2016 జూలైలో మొదలైన ఎస్‌ ఎల్‌ ఏసీసీ వ్యవసాయం, పాడి పశువులపై వాతావరణంఎలాంటి ప్రభావం చూపుతుం దో ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటుంది. అకాల వర్షాలతో అతలాకుతలమవుతున్న బిహార్‌ లోని మధుబనిలో ప్రయోగాత్మకంగా ఎస్‌ ఎల్‌ ఏసీసీ ప్రాజెక్టును ప్రారంభించింది. కరువుతో తల్లడిల్లుతున్న గయలోనూ ప్రాజెక్టును మొదలెట్టింది. పంట నాట్లను తొందరగా వేయాలో లేక ఆలస్యం గా ప్రారంభించాలో ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందిస్తుంటుంది.వర్షం ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో మష్రూమ్స్‌ ,లోటస్‌ లాం టి పంటలనూ వేసేలా ప్రోత్సహిస్తోంది. పంటకు నష్టం రాకుండా ఎలాంటి జాగ్రత్తలుతీసుకోవాలో, వ్యాధులొస్తే ఎలాంటి మందులు వాడాలో కూడా యాప్‌ ల ద్వారా తెలుసుకోవచ్చు.రోగాలొచ్చిన పంటల ఫొటోలు తీసి యాప్‌ లోఅప్‌ లోడ్‌ చేస్తే చాలు ఎక్స్‌ పర్ట్‌‌ సైంటిస్టుల నుంచి సలహాలు, సూచనలు వస్తాయి . పాడి పశువుల రోగాల గురించి వివరాలు అందిస్తారు. సుమారు వెయ్యి మంది రైతులు తమ 2,691 పంటపొలాలను యాప్‌ లో రి జిస్టర్‌ చేసుకున్నారని క్రాప్‌ ఇన్‌ యాప్‌ బ్లాక్‌‌ కో ఆర్డినేటర్‌ ఓం ప్రకాశ్‌చెప్పారు.

పొగాకు నుంచి బొప్పాయికి

బిహార్‌ రాజధాని పాట్నాకు 50 కిలోమీటర్లదూరంలో ఉన్న బీబీపూర్‌ రైతులు ప్రమాదకర పొగాకు పంటను వదిలిపెట్టారు. బొప్పాయి లాంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్లారు. కారణం‘దీహాత్‌ ’ యాప్‌ . ఐఐటీ ఢిల్లీ విద్యార్థి శశాంక్‌‌ కుమార్‌ దీన్ని రూపొందించారు. ఏళ్లుగా  పొ గాకుపండిస్తున్న రైతు కిషున్‌ రాయ్‌ ఈసారి బొప్పాయిని వేశారు. 55 మొక్కలు నాటితే అకాల, వడగండ్ల వానలకు తట్టుకుని 45 బతికాయి. ఇప్పటికేరూ.15 వేలు వచ్చాయని, ఏప్రిల్‌ నాటికి మరోరూ.15 వేలు వస్తాయని ఆయన చెప్పారు. పొగాకును నాటినప్పటి నుంచి నిద్రలేకుండాపని చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎకరం పొగాకుకు రూ.50 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేదని, అన్నీ పోను రూ.1.5 లక్షలు వస్తాయని మరో రైతు ఇంద్రజిత్‌ వివరిం చారు. కానీ బొప్పాయికి రూ.1 లక్ష ఖర్చయితే రూ.3 లక్షలు లాభం వచ్చిందన్నారు. దిహాత్‌ యాప్‌ వల్ల బ్రిజ్‌ భూషన్‌ అనే రైతు మైక్రో ఎంటర్‌ ప్రెన్యూర్‌ అయ్యాడు. దీహాత్‌ ప్లాట్‌ ఫాం కింద పని చేస్తున్న 160మందిలో బ్రిజ్‌ ఒకరు. స్థానిక రైతులకు విత్తనాలు,ఎరువులు అందిస్తున్నాడు. స్థానిక వ్యాపారులకన్నా  30-40 శాతం తక్కువకే ఇస్తున్నాడు. ప్రస్తుతం తన ప్లాట్‌ ఫాంను 70 వేల మంది వాడుకుంటున్నారని, 2022 నాటికి సంఖ్యను పది లక్షలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని యాప్‌ రూపకర్త శశాంక్‌‌ చెప్పారు. నెలవారి ఆదాయంకూడా రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెరుగుతుం దన్నారు.