రైలు డ్రైవర్లకు స్మార్ట్ వాచీలు నిషేధం... ఎందుకంటే

రైలు డ్రైవర్లకు స్మార్ట్ వాచీలు నిషేధం... ఎందుకంటే

రైలు ఇంజన్ డ్రైవర్లకు డ్యూటీ సమయంలో స్మార్ట్ వాచ్లు  పెట్టుకోవద్దని రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  స్మార్ట్వాచ్ను మొబైల్ ఫోన్ మాదిరిగా ఓ ఉద్యోగి ఉయోగించిన పరిప్థితిని గమనించిన అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.  

బైక్ నడిపేటప్పడు హెల్మెట్ కంపల్సరీ.. కారు డ్రైవర్ సీటు బెల్ట్ కంపల్సరీ.. అలాగే ఎవరు ఏ వాహనం నడుపుతున్నా సెల్ ఫోన్ నిషేధం.  అయితే ట్రైన్ డ్రైవర్లకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇంజన్ కేబిన్లో ఇద్దరు డ్రైవర్లు మాత్రమే ఉంటారు.  అవసరమనుకుంటే అధికారులు మరొక డ్రైవర్ను అనుమతిస్తారు.  ఎవరి డ్యూటీ.. ఎవరి విధానాలు వారికుంటాయి. వారు కూడా డ్యూటీ సమయంలో ఫోన్ వాడకూడదు.  ఇప్పుడు రైలు ఇంజన్ డ్రైవర్లకు మరో కొత్త రూల్ వచ్చింది.  ఇక ఫోనే కాదు.. ట్రైన్ రన్నింగ్ సిబ్బందికి స్మార్ట్ వాచ్ లు కూడా నిషేధించారు.  


భారతీయ రైల్వేలోని సదరన్ జోన్‌లో ఒక లోకోమోటివ్ పైలట్ గంటకు 110 కి.మీ వేగంతో రైలును నడుపుతున్నప్పుడు తన స్మార్ట్‌వాచ్ ను చూస్తూ రైలు డ్రైవింగ్ చేయడాన్ని అధికారులు గుర్తించారు.  అయితే ఆయన స్మార్ట్ వాచ్ ను చాలా కొద్ది సేపు మాత్రమే చూశారు.  స్మార్ట్‌వాచ్ స్క్రీన్ తరచుగా ఆన్ అయింది. ఈ ఘటన మదురై డివిజన్ లో జరిగింది. దీంతో ట్రైన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు  సిబ్బందికి స్మార్ట్‌వాచ్‌ల వాడకాన్ని నిషేధిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొ్న్నారు. ఆర్డర్ కాపీలు అమలు కోసం సిబ్బంది లాబీలు, CLIలు, DRM ,  సీనియర్ అధికారులకు పంపామని రైల్వేశాఖ పేర్కొంది.

ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం తరువాత ట్రైన్ డ్రైవర్లు ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని రైల్వే బోర్డు  జోన్‌లు , డివిజన్‌లను ఆదేశించింది. భారతీయ  రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా  సేఫ్టీ డ్రైవ్ ప్రికాషన్స్  పాటిస్తున్నారు. ఇప్పటికే మొబైల్ ఫోన్ల వినియోగం ఇప్పటికే నిషేధించబడినప్పటికీ, రన్నింగ్ సిబ్బంది స్మార్ట్ వాచ్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కొందరు తమ ఆరోగ్య కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి వాటిని ఉపయోగిస్తారు, మరికొందరు బ్లూటూత్ ద్వారా వాటిని కనెక్ట్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్‌ల మాదిరిగా  ఉపయోగిస్తున్నారు.

మధురై డివిజన్ లో   ఇటీవల జరిగిన ఆకస్మిక తనిఖీలో..  డ్యూటీలో ఉన్న ఒక లోకో పైలట్ 110 KMPH వద్ద రైలును నడుపుతున్నప్పుడు తన స్మార్ట్‌వాచ్‌ను తరచుగా చూస్తున్నాడు.  దాని స్క్రీన్ ఖాళీగా ఉన్న స్థితి నుండి తరచుగా ఆన్ అవుతుంది… ఇది చాలా ప్రమాదకరమైనదని సంబంధిత అధికారి తెలిపారు. “కొన్ని స్మార్ట్‌వాచ్‌లు, మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేసినప్పుడు, మొబైల్ ఫోన్‌ మాదిరిగా ఉపయోగించుకోవచ్చని  జోనల్  చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ B గుగనేశన్  తెలిపారు.  స్మార్ట్ వాచ్ లో  ఫోన్ చేసే అవకాశం కూడా ఉందని తెలిపారు. అంతే కాకుండా ఇతరులు ఫోన్ చేసినప్పుడు  కాల్స్  రిసీవ్ కూడా చేసుకోవచ్చు.  రైళ్లలో పనిచేసేటప్పుడు రన్నింగ్ సిబ్బందికి  ఇటువంటి స్మార్ట్‌వాచ్‌లు నిషేధించబడ్డాయి.  

రన్నింగ్ సిబ్బందికి విధి నిర్వహణలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా వారి వెల్లడించిన మొబైల్ ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నాయని నిర్ధారించడానికి రెగ్యులర్ తనిఖీలు నిర్వహిస్తారని భారతీయ రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ అన్నారు. ఇకపై రన్నింగ్ సిబ్బంది  విధి నిర్వహణలో స్మార్ట్ వాచ్ లు కలిగి ఉంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.