నిమిషం చాలు : స్మార్ట్ ఫోన్ తో కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చు

నిమిషం చాలు : స్మార్ట్ ఫోన్ తో కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చు

చేతిలో మొబైల్ ఉంటే చాలు కేవలం 60సెకన్లలో కరోనా సోకిందా లేదా అన్న విషయాన్ని గుర్తించవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్ట్ లు కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ ను  కనిపెట్టేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వాలు సైతం వైరస్ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి వారికి ట్రీట్ మెంట్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బాధితుల్నిగుర్తించేందుకు టెస్ట్ లు చేయాల్సి ఉంది. అయితే ఆ టెస్ట్ ల రిజల్ట్స్  అనుకున్న సమయానికి రాకపోవడం, వైరస్ సోకే వారి సంఖ్య పెరిగి పోతుండడంతో ఆరోగ్య శాఖకు తలనొప్పిగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు అమెరికాలోని ఉటా( Utah ) యూనివర్సిటీ సైంటిస్టులు ఓ డివైజ్‌ను కనిపెట్టారు. గతంలో ఆ యూనివర్సిటీ సైంటిస్ట్ లు జికా వైరస్ ను గుర్తించేందుకు డివైజ్ ను డెవలప్ చేశారు.

ది ప్రింట్ కథనం ప్రకారం.. కరోనా వైరస్ ను గుర్తించేందుకు అవసరమైన టెస్ట్ లను కేవలం నిమిషంలోనే చేస్తున్నారు. సాధారణంగా కరోనా టెస్ట్ చేస్తే కొన్ని గంటలు, నిమిషాల సమయం పడుతుంది. కానీ అమెరికాలోని ఉట్హా  యూనివర్సిటీ సైంటిస్టులు డెవలప్ చేసిన డివైజ్ తో కేవలం నిమిషంలోనే కరోనా సోకిందా లేదా అన్న విషయాన్ని గుర్తించవచ్చు.

అమెరికా యూనివర్సిటీ సైంటిస్ట్ లు డెవలప్ చేసిన డివైజ్ ను మన స్మార్ట్ ఫోన్ కు అటాచ్ చేసి సలైవా(లాలాజలం)ను అంటిస్తే అవుట్ పుట్ వచ్చేస్తుంది. డివైజ్ కు ఉన్న డీఎన్ఏ అనే సెన్సార్‌పై వైరస్ ప్రొటీన్లతో, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కలిసి పాజిటివ్ రిజల్ట్స్ తెలియజేస్తుంది.