మీ ఫోన్ హీటెక్కుతుందా..ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

మీ ఫోన్ హీటెక్కుతుందా..ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

స్మార్ట్ఫోన్లు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంతో ఒక భాగం అయిపోయాయి..ఇప్పుడు దాదాపు సెల్ ఫోన్ వాడని వారు చాలా తక్కువ.  అయితే సెల్ ఫోన్లలో తరుచుగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. హ్యాంగ్ అవడం,హీట్ అవడం వంటి సమస్యలు మనకు తరుచుగా ఎదువుతుంటాయి. సెల్ ఫోన్ హీట్ కావడం అనేది సెల్ ఫోన్లు వాడే అత్యంత సాధారణ మైన సమస్య. సెల్ ఫోన్ హీట్ అయినప్పుడు  మనం ఏం చేయాలి.. తీసుకోవాల్సి జాగ్రత్తలు ఏంటి అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. 

సెల్ ఫెన్ వేడెక్కుతుందంటే  ప్రధాన కారణం మీ చుట్టూ ఉన్న వాతావరణం కావొచ్చు. మీ చుట్టూ వాతావరణం వేడిగా ఉంటే స్మార్ట్ ఫోన్ కూడా వేడెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇది స్మార్ట్ ఫోన్ వినయోగదారులు గమనించాలి. 

ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటం.. 

డివైజ్ వేడెక్కడానికి మరో కారణం ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటం. తక్కువ ఛార్జింగ్లో పెట్టినప్పుడు హ్యాండ్ సెట్ ని నిరంతరం ఉపయోగించడం వల్ల బ్యాటరీపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది డివైజ్ అధికంగా వేడేక్కేందుకు దారి తీస్తుంది. కాబట్టి ఛార్జింగ పెట్టి ఫోన్ మాట్లాడటం చేయొద్దు. 

బ్యాటరీ పాడైతే కూడా... 

స్మార్ట్ ఫోన్ వేడేక్కడానికి మరో కారణం బ్యాటరీ పాడవడం. మీ హ్యాండ్ సెట్ వేడెక్కుతుందంటే.. దానిలో బ్యాటరీ డ్యామేజీ కూడా కారణం కావచ్చు..బ్యాటరీ పాడైపోయి ఎప్పుడూ వేడెక్కుతూ ఉంటే.. వెంటనే బ్యాటరీని చెక్ చేయాలి. 

ప్రాసెసర్లు తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు 

తక్కువ కెపాసిటీ గల ప్రాసెసర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లలో హెవీ గేమింగ్, చాలా సేపు స్మాట్ ఫోన్ వినియోగం, సోషల్ మీడియాలో నిరంతరం శోధించడం వంటి ఇంటెన్సివ్ టాస్క్ లను చేయడం ద్వారా మీ హ్యాండ్ సెట్ వేడెక్కుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ వాడకం తగ్గించడం మంచిది. 

బ్యాగ్ గ్రౌండ్ యాప్ లు, మల్టీ టాస్కింగ్

మీ హ్యాండ్ సెట్ లో ఎక్కువ యాప్ లను వినియోగించినట్లయితే కూడా వేడెక్కుతుంది. తరుచుగా మనం యాప్ లను ఓపెన్ చేసి పెడతాం.. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ పై పనిభారం పడుతుంది. ఇది ఛార్జింగ్ ని తగ్గిస్తుంది. కాబట్టి యాప్ లను వాడిన తర్వాత వెంటనే సైన్ అవుట్ చేయాలి. 

పాత్ సాఫ్ట్ వేర్లు, అప్ డేట్ చేయకపోవడం

స్మార్ట్ ఫోన్ వేడెక్కడానికి మరో కారణం.. వాడుకలో లేని సాఫ్ట్ వేర్. స్మార్ట్ ఫోన్ స్పీడ్ తగ్గించే సాధారణ అప్ డేట్ లు చేయకపోవడం. మీ స్మార్ట్ ఫోన్ లైఫ్ పెంచాలంటే.. ఎప్పటికప్పుడూ అప్ డేట్ చేసుకోవాలి. 

స్మార్ట్ ఫోన్ వేడెక్కకుండా చిట్కాలు 

  • సాఫ్ట్ వేర్ అప్ డేట్
  • ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడకూడదు
  • మీ స్మార్ట్ ఫోన్ ను క్రమం తప్పకుండా రీస్టాట్ చేస్తూ ఉండాలి 
  • బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్ అప్లికేషన్లు, స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, లోకేషన్ , బ్లూటూత్, వైఫై హాట్ స్పాట్ వంటి ఫీచర్లను ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలి.