విస్తరణ బాటలో గృహశక్తి

విస్తరణ బాటలో గృహశక్తి

హైదరాబాద్:  హౌసింగ్ ఫైనాన్స్ ప్రొవైడర్ ఎస్​ఎంఎఫ్​జీ గృహశక్తి (గతంలో ఫుల్లెర్టన్ ఇండియా హోమ్ ఫైనాన్స్ కో– లిమిటెడ్), తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లలో విస్తరించాలని యోచిస్తోంది. ఇది ఇండ్ల యజమానులకు అఫర్డబుల్​ హౌసింగ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తుంది.  సంస్థ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) పరంగా మొదటి ఐదు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో సంస్థకు తెలంగాణ నుంచి రూ. 639 కోట్ల బిజినెస్​ వచ్చింది. 

ప్రస్తుతం, కంపెనీకి తెలంగాణలో 120 మందికి పైగా ఉద్యోగులు,  ఏడు శాఖల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో మరో 3-5 శాఖలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇది హోంలోన్లతోపాటు హోం ఇంప్రూవ్​మెంట్​, ఎక్స్​టెన్షన్​లోన్లు, కన్​స్ట్రక్షన్​ ఫైనాన్స్​ ఇస్తుంది.  తెలంగాణ  ఏపీలో కంపెనీ విస్తరణ ప్రణాళికల గురించి ఎస్​ఎంఎఫ్​జీ గృహశక్తి  సీఈఓ దీపక్ పాట్కర్ మాట్లాడుతూ తమకు తెలంగాణ ఒక ముఖ్యమైన రాష్ట్రమని, ఇక్కడ గ్రోత్​ వందశాతం ఉందని చెప్పారు. తమ వడ్డీరేట్లు పది శాతం నుంచి మొదలవుతాయని, కనీస టికెట్​సైజు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు.