
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ పీఎస్ ను కొందరు పోలీసులు బార్గా మార్చారు. ఏకంగా స్టేషన్ లోకే మందు తెచ్చుకొని తాగుతూ దర్జాగా దమ్ము కొడుతున్నారు. పోలీసుల ప్రవర్తనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం జరిగి వారికి న్యాయం చేయాల్సిన ఖాకీలే మద్యం మత్తులో ఉంటుంటే మా ప్రాబ్లమ్స్ఎవరికి చెప్పుకోవాలని అంటున్నారు. శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న శ్రీనివాస్, కృష్ణ అనే పోలీసులు స్టేషన్లో మందు తాగుతున్నారని సమాచారం వచ్చింది. వెంటనే మీడియా అక్కడికి చేరుకుంది. మీడియాను గమనించిన వారు వెంటనే బాటిళ్లను కవర్లో వేసి పక్కన పెట్టారు. తర్వాత తీసుకెళ్లి బయట పడేశారు. మందు తాగుతున్నప్పుడు సివిల్ డ్రెస్సులో ఉండి మీడియా కంట పడ్డాక పోలీస్ యునిఫాం వేసుకొని కుర్చీలో అమాయకంగా కూర్చున్నాడు మరో పోలీస్ అధికారి. పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.