స్మోకింగ్ కిల్స్: ది మోస్ట్ చీపెస్ట్ రిఫ్రెష్మెంట్

V6 Velugu Posted on Jan 08, 2021

స్మోకింగ్ ఈజ్​ ద మోస్ట్ చీపెస్ట్ రిఫ్రెష్ మెంట్ థింగ్ ఇన్ వరల్డ్… అని చాలామంది స్మోకర్స్ చెప్పే మాట. కానీ ప్రపంచంలోనే ఎక్కువమంది ప్రాణాలు తీసే కారణాల్లో ఇది కూడా ఒకటని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం ఏదో ఒకరకంగా స్మోకింగ్ తో సంబంధం ఉన్నవాళ్లే అని రిపోర్ట్స్ చెబుతున్నాయి.  కోవిడ్​ విజృంభిస్తున్న ఈ కాలంలో స్మోకింగ్​ మానేయటం తప్పనిసరి అంటున్నారు డాక్టర్లు. ఆర్సెనిక్, బెంజీన్, కార్బన్‌మోనాక్సైడ్, హైడ్రోజన్‌ సైనైడ్, పొలోనియమ్‌…. ఏంటివన్నీ అనుకుంటున్నారా?  కెమికల్ సైన్స్ గురించిన పాఠంలా అనిపిస్తోంది కదా? ఇది ఒక సిగరెట్ లో ఉండే డేంజరస్ కెమికల్స్ లిస్ట్. ఇవి కొన్ని మాత్రమే. మొత్తం చెప్పాలంటే ఒక్క సిగరెట్​లో 4,800 రసాయనాలు ఉంటాయ్.. ఆ లిస్టులో ఉండే 50 నుంచి 69 రసాయనాలు క్యాన్సర్ కారకాలు. స్మోకింగ్( క్రానిక్ అబ్​స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్) వంటి శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ తెల్సినవే. కానీ… ఇప్పుడు మళ్లీ ఒకసారి కోవిడ్ టైంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్ వచ్చి తగ్గినవాళ్లలో.. అది కూడా ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్లకు, స్మోకింగ్ అలవాటు మరింత ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు.. సిఓపిడి లేదా క్రానిక్ అబ్​స్ట్రక్టివ్  పల్మనరీ డిసీజ్ గురించి అంతగా వినబడనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఇది మూడవ ముఖ్యమైన కారణం అవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ పొగతాగడం మానేస్తే, ఇప్పుడున్న క్యాన్సర్‌ రోగుల సంఖ్యలో తక్షణం 30 శాతం కేసులు తగ్గుతాయి. క్రమంగా 50 శాతానికి పైగా క్యాన్సర్‌తో సంభవించే మరణాలూ తగ్గుతాయట. స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లలో కోవిడ్-19 ప్రమాదం ఎక్కువగా ఉంది. వైరస్ సోకి తగ్గిపోయిన తర్వాత కూడా స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లకి ప్రమాదమే. దాదాపు 20 లక్షల 40 వేల మంది నుంచి సేకరించిన సమాచారంతో ‘కింగ్స్ కాలేజీ లండన్, సెయింట్ థామస్ హాస్పిటల్’​లో సైంటిస్టులు ‘జో కోవిడ్ సింప్టమ్​ ట్రాకర్’ అనే యాప్​ని తయారు చేశారు. ఈ యాప్ రిపోర్ట్ ప్రకారం కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వారిలో పొగతాగని వాళ్ల కంటే పొగతాగే వాళ్లు రెండింతల మంది హాస్పిటల్​లో చేరారు. ఇక అమెరికాలో కూడా నాన్ స్మోకర్స్ కంటే స్మోకింగ్ చేసే వాళ్లే  1. 8 శాతం ఎక్కువగా కోవిడ్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడ్డారని స్టడీలో తేలింది. అలా సిగరెట్ ని వదిలించుకున్నా సరదాగా అలవాటైంది. కానీ, మానేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా వదలటం కష్టమయ్యేది. మా అన్నయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు ఆయనతో హాస్పిటల్ లో ఉండి చాలామంది క్యాన్సర్ పేషెంట్లని చూశాను. అందులో కొందరు పొగాకు వాడటం అలవాటున్న వాళ్లు. నిజంగా నాకేమైనా అయితే నా ఫ్యామిలీ పరిస్థి తి ఏమిటి? మరీ ఇంత ఫూలిష్ గా చచ్చిపోవాలా అనిపించింది. నాకు నేనుగా మానెయ్యడం కష్టం అని పల్మొనాలజిస్ట్ ని కలిసాను. ఆయన చెప్పినవి చేస్తూనే..నాకు నేను కూడా బలంగా నిలబడ్డా ను. అలా సిగరెట్ ని వదిలించుకున్నా . ఎలా అయినా చచ్చేదే.. కానీ, ఆ ఛాన్స్ సిగరెట్ కి ఎందుకు ఇవ్వాలి? – ప్రదీప్ సాయా , హైదరాబాద్ అమ్మా, నాన్నగుర్తొచ్చారు కాలేజ్ లో ఉన్నప్పుడే సిగరెట్ అలవాటైంది. అది కూడా చాలా ఎక్కు వగా. రోజుకి 20 సిగరెట్ల వరకూ కాల్చేవాడ్ని. నడుస్తుంటే ఆయాసం వచ్చేది, అప్పుడప్పుడు చెస్ట్ లో పెయిన్ కూడా అనిపిం చేది. గొంతు నొప్పి, దగ్గు ఇలా అన్నీ మొదలయ్యాయి. ఒకరోజు సిగరెట్ కాలుస్తున్నప్పుడే మా అమ్మా, నాన్న గుర్తొచ్చారు. నాకేమైనా అయితే వాళ్లెలా అనిపించింది. వెంటనే వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నా ను. అన్నీ నార్మల్ అనే రిపోర్ట్ వచ్చింది. అప్పట్నిం చి సిగరెట్ మానేశా. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆయాసం, దగ్గు వస్తూనే ఉన్నా యి. కానీ ఇంతకు ముందు ఉన్నం త ఎక్కు వ మాత్రం కాదు. సిగరెట్ మానేశాక తలనొప్పి, యాంగ్జైటీ అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు దానికి లొంగితే ఎప్పటికీ మానలేననిపించి అసలు ముట్టుకోకూడదని డిసైడయ్యా. – సురేష్, మెడికల్ కోడర్, ఖమ పూర్తిగా ప్రమాదం తప్పినట్టు కాదు స్మోకింగ్  అలవాటు ఉన్నవాళ్లకి కోవిడ్ వచ్చి తగ్గినా పూర్తిగా ప్రమాదం తప్పినట్టు కాదు. స్మోకింగ్ అలవాటు వల్ల లంగ్ వాల్యూమ్​  తగ్గిపోతుంది. ఇక కరోనా దాడి కూడా ఎక్కువగా ప్రభావం చూపించేది రెస్పిరేటరీ సిస్టం మీదనే.  రికవర్డ్ పేషెంట్స్ లో ఫైబ్రోసిస్ ఎక్కువగా కనిపిస్తోంది. అది కూడా స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లలోనే ఎక్కువ. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్లకి సిటీ స్కాన్, స్పైరోమెట్రి అనే టెస్టులు చేస్తే లంగ్స్ ఆరోగ్యంగా ఉన్నాయా? లేదా ? అని తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్​మెంట్ కంటిన్యూ చెయ్యొచ్చు. అయితే ట్రీట్​మెంట్ మాత్రమే సరిపోదు. సిగరెట్ ని దూరం పెట్టటం తప్పనిసరి. నికోటిన్ డిపెండెన్సీని  బట్టి కొన్నిసార్లు మెడిసిన్స్ వాడి సిగరెట్ తాగే అలవాటు  తగ్గించుకోవచ్చు. నికోటిన్ డిపెండెన్సీ ఎక్కువగా లేకపోతే మామూలు కౌన్సెలింగ్ సరిపోతుంది. అయితే సిగరెట్ మానెయ్యాలనే ఆలోచన, దానికోసం కొంచెం  ఓపిక ఉండాలి. డా. కె. శైలజ, పల్మొనాలజిస్ట్ ,కేర్ హాస్పిటల్స్ మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ యారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ నడిసొచ్చిన దారిలో నలుగురికి సాయం చేస్తున్నారు పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం

Tagged associated, out of five

Latest Videos

Subscribe Now

More News