సోల్ సిస్టర్ కు ప్రేమతో..

సోల్ సిస్టర్ కు ప్రేమతో..

ఏక్తా కపూర్… ఇండియన్ టెలివిజన్ పై స్టా ర్ మేకర్. బాలాజీ టెలీఫిలిమ్స్ మంచి సీరియళ్లు, సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తోం ది. ఇండియాలో అత్యధిక సీరియళ్లను నిర్మిం చిన ప్రొడ్యూసర్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తీసిన సీరియళ్లు చాలా వరకు సక్సెస్ సాధించినవే. ఏక్తా ప్రొడ్యూస్ చేసిన వాటిలో సూపర్ సక్సెస్ సాధించిన సీరియల్ ‘క్యూంకీ సాస్ బి కభీ బాహుథీ’. ఈ సీరియల్లో ప్రధానపాత్రధారి ‘స్మృతి ఇరాని’. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈసీరియల్ నిర్మాత ఏక్తా కపూర్, స్మృతి ఇరానిల మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం స్మృతి రాజకీయాల్లో ఉన్నా ఆమె కోసం ఓ లేఖ రాసి, తన అభిమానాన్ని చాటుకుంది ఏక్తా.

స్మృతి ఇరాని.. ఇప్పుడు అందరికీ ఓ కేంద్ర మంత్రిగానే తెలుసు. కానీ, ఒకప్పుడు ఈమె మంచి నటి, నిర్మాత, మోడల్ కూడా. అనేక హిందీ సీరియళ్లలో కీలక పాత్రలు పోషించింది. అన్నింటిలోకీ ఆమెకు పేరు తీసుకొచ్చిన సీరియల్ ‘‘క్యూంకీ సాస్ బి కభీబాహు థీ’. జూలై 2000లో ప్రారంభమైన ఈ సీరియల్ సూపర్ హిట్ సాధించింది. ఈ సీరియల్ తో స్మృతి పేరు దేశవ్యాప్తంగామారుమోగిపోయింది. మరెన్నో అవకాశాల్ని తెచ్చిపెట్టింది. ఎనిమిదేళ్లపాటు ఈ సీరియల్ కొనసాగింది. దీన్ని నిర్మించింది ఏక్తా కపూర్ కు చెందిన బాలాజీ టెలీఫిలిమ్స్ . ఈ సీరియల్ సందర్భంగా ఏక్తా, స్మృతిల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.రాజకీయ ప్రవేశం సీరియల్స్ లో నటిస్తున్న సమయంలోనే 2003లో బీజేపీలో చేరారు. తర్వాత 2004లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి పలు విభాగాల్లో రాజకీయాల్లో పని చేశారు. క్రమంగా రాజకీయంగా బిజీ అవ్వడంతో సినిమాలు, సీరియళ్లను వదిలేశారు. నటనకు పూర్తిగా స్వస్తి చెప్పి రాజకీయాలకే అంకితమయ్యారు.

కొనసాగిన బంధం

స్మృతి రాజకీయాల్లో కి వెళ్లినా ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఏక్తా కపూర్ వదులుకోలేదు. స్మృతిని ఏక్తా ‘సోల్ సిస్టర్’ గా భావిస్తుంది.ఇన్నేళ్లైనా ఈ సిస్టర్స్ మధ్య అనుబంధం అలాగే ఉంది. అందుకే తన సోల్ సిస్టర్ అయిన స్మృతి ఇరాని పుట్టిన రోజు (మార్చి23, శనివారం)  ఈ సందర్భంగా ఏక్తా కపూర్ ప్రేమతో ఓ లేఖ రాసింది. ‘నాకు రాజకీయాల గురించేమీ తెలియదు. కానీ, మీరు (స్మృతి) మాత్రం ఎప్పుడూ మంచి వైపే నిలబడతారు. సమాజానికి సేవ చేసేందుకు పోరాడుతారు. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని లేఖలో పేర్కొంది.