కోహ్లీకి క్షమాపణలు చెప్పిన స్మృతి మందాన.. కారణం ఏంటంటే..?

కోహ్లీకి క్షమాపణలు చెప్పిన స్మృతి మందాన.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం దేశంలో మహిళా ఐపీఎల్ హడావుడి నడుస్తుంది. మెన్స్ ఐపీఎల్ ప్రారంభం కాకముందే అభిమానులకు తమ ఆటతో కిక్ ఇస్తున్నారు. థ్రిల్లింగ్ మ్యాచ్ లను అభిమానులకు అందిస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ఇదిలా ఉంటే మహిళల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ సీజన్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ లీగ్ మొదటి మ్యాచ్ లోనే స్మృతి మందాన టాస్ సమయంలో మాట్లాడుతున్నప్పుడు ఆర్సీబీ అంటూ అభిమానుల చేసిన గోల అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఆర్సీబీ జట్టును లీడ్ చేయడం తన అదృష్టమని చెప్పిన స్మృతి..తాజగా కోహ్లీకి క్షమాపణలు తెలియజేసింది. ఫిబ్రవరి 28 (బుధవారం) యూట్యూబ్‌లో విడుదల చేసిన RCB పాడ్‌కాస్ట్‌లో 'పిక్షనరీ' ప్లే చేస్తూ ఫన్నీ విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీసింది. హెడ్ -టు-హెడ్ గేమ్ సమయంలో..ఏదైనా చిత్రాన్ని డ్రా చేయాల్సి రావడంతో మంధాన కోహ్లీ బొమ్మను గీసింది. ఈ చిత్రాన్ని యాంకర్ నాగ్ చెప్పాల్సి వచ్చింది. మొదట నాగ్ కు కిరీటం గీసి ఏంటో కనిపెట్టమని ఒక సూచన ఇచ్చింది. కానీ అతను సమాధానం ఊహించలేకపోయారు.

ALSO READ :- నన్ను కావాలనే బయటికి గెంటేశారు - గొల్లపల్లి..!

ఆమె ఒక కార్టూన్ బొమ్మకు గీసి గడ్డం ఏంటో చెప్పమని క్లూ ఇచ్చింది. పైన కిరీటం, కింద గడ్డం చూసేసరికి అతను కోహ్లీ అని చెప్పాడు. దీంతో ఇద్దరు ఆ ఫోటోను చూసి ఇది కోహ్లీ చిత్రమా.. అని సరదాగా నవ్వుకున్నారు. 'కోహ్లీ బొమ్మ' కామెడీగా గీసిన మందాన విరాట్ కు  క్షమాపణలు తెలియజేసింది. స్మృతి మంధాన లీడ్ చేస్తున్న 2024 మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) సీజన్‌లో RCBW వరుసగా రెండు విజయాలను సాధించింది.