
క్వీన్స్‌టౌన్: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఇండియా విమెన్స్ చావోరేవో పోరుకు రెడీ అయింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి 0–2తో వెనుకబడిన మిథాలీరాజ్ కెప్టెన్సీలోని టీమ్ శుక్రవారం జరిగే మూడో వన్డేలో గెలిస్తేనే సిరీస్ రేసులో నిలవనుంది. ఎక్స్‌టెండెడ్ క్వారంటైన్ కారణంగా ఏకైక టీ20 మ్యాచ్‌తో పాటు ఫస్ట్ రెండు వన్డేలకు దూరమైన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అందుబాటులోకి రావడం టీమ్‌కు ప్లస్ పాయింట్. ఈ టూర్‌లో ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో మంధాన లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఓపెనర్ స్మృతి రాకతో బ్యాటింగ్ బలం కాస్త పెరిగింది. కెప్టెన్ మిథాలీరాజ్‌తో పాటు రీఎంట్రీలో రాణిస్తున్న మరో తెలుగు క్రికెటర్ సబ్బినేని మేఘన ఫామ్‌లో ఉన్నారు. అయితే, వరుసగా ఫెయిలవుతున్న వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఇప్పుడు చాలా ప్రెజర్ ఉంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అయినా ఆమె రాణిస్తుందో లేదో చూడాలి.