
సముద్రపు దొంగలు.. వీళ్లను ఇప్పుడు స్మగ్లర్స్ అంటున్నాం.. శ్రీలంక దేశం నుంచి అక్రమంగా భారతదేశంలోకి వస్తున్న బంగారాన్ని గుర్తించారు కోస్ట్ గార్డ్ అధికారులు.. పట్టుకుంటే జైలుకు వెళ్లాలి.. అసలు బంగారం మొత్తం పోతుందని భావించిన స్మగ్లర్లు.. ఎంతో తెలివిగా.. తమ దగ్గర ఉన్న 32 కేజీల బంగారాన్ని సముద్రంలోకి విసిరేశారు. ఊహించని ఈ ఘటనతో షాక్ అయ్యారు కోస్ట్ గార్డ్ అధికారులు. సముద్రంలో పడేసిన బంగారాన్ని ఎలాగైనా బయట తీయాలని డిసైడ్ అయిన అధికారులు.. అందు కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి.. రెండు రోజులు గాలించి.. 32 కేజీల బంగారాన్ని బయటకు తీశారు.. దీని విలువ ఎంతో తెలుసా.. అక్షరాల 20 కోట్ల రూపాయలు.. ఇది జరిగింది తమిళనాడు రాష్ట్రం చెన్నై సముద్ర తీర ప్రాంతంలో..
శ్రీలంక నుంచి తమిళనాడు రాష్ట్ర తీరానికి రెండు నాటు పడవలు వస్తున్నాయి.. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా.. అనుమానాస్పదంగా కనిపించటంతో.. ఆ రెండు పడవలను పట్టుకునేందుకు ప్రయత్నించారు కోస్ట్ గార్డ్ అధికారులు. ఎటూ దొరికిపోతాం అని డిసైడ్ అయిన స్మగ్లర్లు.. తమ దగ్గర బ్యాగుల్లో ఉన్న బంగారాన్ని సముద్రంలోకి విసిరేశారు. పడవ లోనుంచి సముద్రంలోకి బ్యాగులు విసిరేయటం గమనించిన అధికారులు.. వాటిని వెతికి మరీ బయటకు తీశారు. తమిళనాడులోని మండపం ఫిషింగ్ హార్బర్ సమీపంలోని సముద్రంలో ఈ ఘటన జరిగింది.
ఈ రెండు పడవల్లోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీళ్లందరూ శ్రీలంకకు చెందిన మత్స్యకారులుగా గుర్తించారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి స్మగ్లింగ్ చేశారా లేదా.. ఇదేనా మొదటిసారి.. బంగారాన్ని ఎవరు పంపించారు.. ఎవరికి చేరవేయబోతున్నారు.. ఆర్డర్ చేసింది ఎవరు.. ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ముట్టాయి.. అనే పూర్తి వివరాలను అరెస్ట్ అయిన ఐదుగురు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు.